-
-
Home » Sports » Cricket News » IPL 2025 Delhi Capitals vs Gujarat Titans Live Match Updates Score and Highlights in Telugu News Siva
-

DC vs GT Match Live Updates: డీసీ వర్సెస్ జీటీ.. గెలుపెవరిదో..
ABN , First Publish Date - Apr 19 , 2025 | 03:08 PM
DC vs GT IPL 2025 Live Updates in Telugu: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగ ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.

Live News & Update
-
2025-04-19T19:43:44+05:30
ఢిల్లీ క్యాపిటల్స్ మీద గుజరాత్ టైటాన్స్ బంపర్ విక్టరీ కొట్టింది.
మరో 4 బంతులు ఉండగానే విజయతీరాలకు చేరుకుంది జీటీ.
204 పరుగులు ఛేదనలో 7 వికెట్ల తేడాతో నెగ్గింది గుజరాత్.
97 పరుగులతో లాస్ట్ వరకు నాటౌట్‌గా ఉన్న బట్లర్.. ఈ ఇన్నింగ్స్‌లో గుజరాత్‌కు రియల్ హీరో అని చెప్పాలి.
-
2025-04-19T19:17:42+05:30
భారీ లక్ష్య ఛేదనలో జీటీ బ్యాటర్ బట్లర్ చెలరేగుతున్నాడు.
మిచెల్ మార్ష్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో వరుసగా 5 ఫోర్లు బాదాడు బట్లర్.
-
2025-04-19T19:02:45+05:30
బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
బిగ్ స్కోర్ చేజింగ్‌లో 32 బంతుల్లో అర్ధ శతకం మార్క్‌ను అందుకున్నాడు జీటీ బ్యాటర్.
గుజరాత్ విజయం కోసం 38 బంతుల్లో ఇంకో 70 పరుగులు కావాలి.
-
2025-04-19T18:52:03+05:30
భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ దూసుకెళ్తోంది.
203 పరుగుల్ని చేజ్ చేసేందుకు బరిలోకి దిగిన జీటీ.. 11.3 ఓవర్లలో 101 పరుగులతో ఇప్పుడు స్ట్రాంగ్‌గా ఉంది.
బట్లర్ (46 నాటౌట్), రూథర్‌ఫర్డ్ (11 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
బట్లర్ భారీ షాట్లతో డీసీ బౌలర్లను భయపెడుతున్నాడు.
ఇప్పటికే 2 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు బట్లర్.
డీసీ గెలుపునకు 50 బంతుల్లో మరో 101 పరుగులు కావాలి.
-
2025-04-19T18:33:27+05:30
చేజింగ్‌లో దూసుకెళ్తున్న జీటీకి రెండో షాక్ తగిలింది.
ఓపెనర్ సాయి సుదర్శన్ (36) ఔట్ అయ్యాడు.
కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిగిరాడు సుదర్శన్.
ప్రస్తుతం 7.3 ఓవర్లలో 2 వికెట్లకు 74 పరుగులతో ఉంది జీటీ.
-
2025-04-19T18:17:42+05:30
సాయి సుదర్శన్ (11 బంతుల్లో 23 నాటౌట్) తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
ఇప్పటికే 3 బౌండరీలు బాదిన ఈ లెఫ్టాండర్.. ఓ బిగ్ సిక్స్ కూడా కొట్టాడు.
జోస్ బట్లర్ (11 బంతుల్లో 23 నాటౌట్) కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు.
సుదర్శన్-బట్లర్ వేగంగా ఆడుతుండటంతో 4.3 ఓవర్లలో 53 పరుగులతో సాలిడ్‌గా కనిపిస్తోంది జీటీ.
-
2025-04-19T18:04:38+05:30
ఇన్నింగ్స్‌ను పాజిటివ్‌గా స్టార్ట్ చేసిన జీటీకి గట్టి షాక్ తగిలింది.
ఆ టీమ్ కెప్టెన్ గిల్ (7) రనౌట్ అయ్యాడు.
కరుణ్ నాయర్ కొట్టిన త్రోకి గిల్ పెవిలియన్‌కు చేరక తప్పలేదు.
1.5 ఓవర్లకు జీటీ స్కోరు 1 వికెట్ నస్టానికి 14.
-
2025-04-19T17:56:57+05:30
గుజరాత్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది.
చేజింగ్‌ను పాజిటివ్‌గా స్టార్ట్ చేసింది జీటీ.
సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ మంచి ఇంటెంట్‌తో ఆడుతున్నారు.
-
2025-04-19T17:37:57+05:30
ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది.
అక్షర్ సేన ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 203 పరుగులు చేసింది.
ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ అక్షర్ పటేల్ (39) టాప్ స్కోరర్.
అశుతోష్ శర్మ (37), ట్రిస్టన్ స్టబ్స్ (31) కూడా రాణించారు.
జీటీ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లతో అదరగొట్టాడు.
సిరాజ్, అర్షద్, ఇషాంత్, సాయి కిషోర్ తలో వికెట్ తీశారు.
-
2025-04-19T17:27:47+05:30
ఇన్నింగ్స్ ఆఖర్లో డీసీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది.
గుజరాత్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థికి షాకులు ఇస్తున్నారు.
విప్రజ్ నిగమ్‌ను ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌లో ప్రసిద్ధ్‌కు ఇది 4వ వికెట్ కావడం గమనార్హం.
-
2025-04-19T17:17:29+05:30
డీసీ వికెట్లు కోల్పోతున్నా పరుగుల జోరు ఆపడం లేదు.
అశుతోష్ శర్మ (9 బంతుల్లో 19 నాటౌట్) ధనాధన్ షాట్లతో చెలరేగుతున్నాడు.
-
2025-04-19T16:54:01+05:30
డీసీ నాలుగో వికెట్ కోల్పోయింది
ట్రిస్టన్ స్టబ్స్ (21 బంతుల్లో 31) ఔట్ అయ్యాడు.
స్టబ్స్‌ను సిరాజ్ మియా వెనక్కి పంపించాడు.
-
2025-04-19T16:43:47+05:30
ఢిల్లీ క్యాపిటల్స్ నిలకడగా ఆడుతోంది.
కెప్టెన్ అక్షర్ పటేల్ (25 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (23 నాటౌట్) సిచ్యువేషన్‌ను బట్టి బ్యాటింగ్ చేస్తున్నారు.
అక్షర్-స్టబ్స్ సిక్సుల కంటే ఫోర్లు బాదడం మీదే ఫోకస్ చేస్తున్నారు.
ఢిల్లీ 13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 131 పరుగులతో ఉంది.
-
2025-04-19T16:23:31+05:30
కరుణ్ నాయర్ (18 బంతుల్లో 31) ఔట్ అయ్యాడు.
కేఎల్ రాహుల్‌ను ఔట్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణే.. కరుణ్‌నూ వెనక్కి పంపించాడు.
మంచి జోరు మీదున్న కరుణ్ ఔట్ అవడంతో బిగ్ స్కోర్ బాదాలన్న డీసీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు.
-
2025-04-19T16:03:02+05:30
ఓపెనర్ పోరెల్ (18) మంచి ఊపు మీద ఉండగా ఔట్ అయ్యాడు.
ఇప్పుడు కేఎల్ రాహుల్ (14 బంతుల్లో 28) కూడా వికెట్ పారేసుకున్నాడు.
ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోతున్న రాహుల్‌ను స్టన్నింగ్ యార్కర్‌తో వెనక్కి పంపించాడు ప్రసిద్ధ్ కృష్ణ.
ప్రస్తుతం డీసీ స్కోరు 5 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 59.
-
2025-04-19T15:52:15+05:30
ఫస్ట్ ఓవర్ నుంచే దంచుడు మొదలుపెట్టారు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు.
అభిషేక్ నాయర్ (9 బంతుల్లో 18) త్వరగానే ఔట్ అయినా ఉన్నంత సేపు అదరగొట్టాడు.
కరుణ్ నాయర్ (7 నాటౌట్), కేఎల్ రాహుల్ (12 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
ప్రస్తుతం డీసీ స్కోరు 3.1 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 41.
-
2025-04-19T15:12:30+05:30
గుజరాత్ టైటాన్స్ ఫుల్ టీమ్ ఇదే..
-
2025-04-19T15:11:42+05:30
ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ టీమ్ ఇదే..
-
2025-04-19T15:08:34+05:30
టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.
ఫీల్డింగ్ ఎంచుకున్న జీటీ.
బ్యాటింగ్‌కు దిగనున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్.