Share News

Kuldeep Yadav: కివీస్‌కు చుక్కలు చూపిస్తున్న కుల్దీప్.. బాల్‌ను బొంగరంలా తిప్పుతూ..

ABN , Publish Date - Mar 09 , 2025 | 03:59 PM

IND vs NZ Live Score: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్‌లో న్యూజిలాండ్‌కు చుక్కలు చూపిస్తున్నాడు కుల్దీప్ యాదవ్. స్టన్నింగ్ బౌలింగ్‌తో కివీస్‌ను ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు.

Kuldeep Yadav: కివీస్‌కు చుక్కలు చూపిస్తున్న కుల్దీప్.. బాల్‌ను బొంగరంలా తిప్పుతూ..
India vs New Zealand

చాంపియన్స్ ట్రోఫీ-2025లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. గ్రూప్ దశ మ్యాచులతో పాటు సెమీఫైనల్‌లోనూ అతడు అంత ఎఫెక్టివ్‌గా బౌలింగ్ చేయలేదు. మొత్తం బౌలర్లలో అతడే కాస్త ఎక్కువగా పరుగులు సమర్పించుకున్నాడు. అంతగా వికెట్లు కూడా తీయలేదు. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూకు అతడు బిగ్ మైనస్ అవుతాడని అంతా భావించారు. కానీ దీన్ని తారుమారు చేశాడు కుల్దీప్. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టైటిల్ ఫైట్‌లో అతడు చెలరేగి బౌలింగ్ చేస్తున్నాడు.


గూగ్లీతో గుక్క తిప్పుకోకుండా..

దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్-కివీస్ పోరులో కుల్దీద్ యాదవ్ రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నాడు. ఫోర్లు, సిక్సులతో హోరెత్తించిన రచిన్ రవీంద్ర (37)ను క్లీన్‌బౌల్డ్ చేసిన చైనామన్ బౌలర్.. ఆ తర్వాత డేంజరస్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (11)కు పెవిలియన్ దారి చూపించాడు. 11వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన స్టార్ స్పిన్నర్ వేసిన తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. అద్భుతమైన గూగ్లీతో రచిన్‌ను బోల్తా కొట్టించాడు. అనంతరం కేన్ మామను ఔట్ చేసి భారత శిబిరంలో సంతోషాన్ని డబుల్ చేశాడు. ప్రస్తుతం 17.3 ఓవర్లలో కివీస్ 3 వికెట్లకు 93 పరుగులతో ఉంది. డారిల్ మిచెల్ (15 నాటౌట్)తో పాటు టామ్ లాథమ్ (7 నాటౌట్) క్రీజులో ఉన్నారు. కుల్దీప్‌కు తోడుగా ఇతర స్పిన్నర్లు, పేసర్లు ఇలాగే అద్భుతంగా బౌలింగ్ చేస్తే ప్రత్యర్థి జట్టు 200 పరుగుల్లోపే చాప చుట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి.. కుల్దీప్ మ్యాజిక్ ఏ రేంజ్‌ వరకు కంటిన్యూ అవుతుందో చూడాలి.


ఇవీ చదవండి:

టాస్‌ ఓడినా భారత్‌కు అదిరిపోయే న్యూస్

ప్లేయింగ్ 11తో ట్విస్ట్ ఇచ్చిన రోహిత్

కివీస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న బ్యాటర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 09 , 2025 | 04:03 PM