Share News

Team India: వాళ్లకు బ్యాటింగ్ చేతకాదు.. గాలి తీసేసిన అశ్విన్!

ABN , Publish Date - Jul 02 , 2025 | 11:13 AM

అంత సీన్ లేదంటూ టీమిండియాపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లకు బ్యాటింగ్ చేతకాదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

Team India: వాళ్లకు బ్యాటింగ్ చేతకాదు.. గాలి తీసేసిన అశ్విన్!
Ravichandran Ashwin

లీడ్స్ టెస్ట్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న భారత జట్టు.. ఎడ్జ్‌బాస్టన్‌లో తడాఖా చూపించాలని అనుకుంటోంది. రెండో టెస్ట్‌లో ఆతిథ్య జట్టుకు గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తోంది. ఈసారి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ యూనిట్‌ను బలోపేతం చేసుకోవడం మీద దృష్టి సారించిన భారత్.. అన్ని రంగాల్లోనూ రాణించి విజయంతో సిరీస్‌ను సమంతో చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ తరుణంలో వాళ్లకు బ్యాటింగ్ చేతగాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఇంతకీ అతడు ఎవర్ని ఉద్దేశించి ఇలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..


ఆశలు పెట్టుకోవద్దు..

‘బ్యాటర్లు బాధ్యత తీసుకొని ఆడాలి. లీడ్స్ టెస్ట్‌లో మన జట్టు బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. పరుగుల వర్షం కురిపించారు. ఏకంగా 5 సెంచరీలు బాదారు. కానీ భారీ శతకాలు నమోదు కాలేదు. 150 ప్లస్ స్కోర్లు రాలేదు. మరో విషయం గుర్తుంచుకోవాలి. బ్యాటింగ్‌లో లోయరార్డర్ నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. మన జట్టు ఫాస్ట్ బౌలర్లు బ్యాటింగే చేయలేరు. వాళ్లకు పరుగులు చేయడం రాదు’ అని అశ్విన్ స్పష్టం చేశాడు. టెయిలెండర్ల దగ్గర నుంచి పరుగులు ఆశించొద్దని వెటరన్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు.


మెయిడిన్లే ముఖ్యం..

టీమిండియా నెగ్గాలంటే పేస్ బౌలర్లు అదరగొట్టాలని అశ్విన్ సూచించాడు. జస్‌ప్రీత్ బుమ్రాకు సపోర్ట్‌గా మిగతా బౌలర్లు రాణిస్తే జట్టును ఆపడం ఎవరి వల్లా కాదన్నాడు. ‘టెస్టుల్లో మెయిడిన్ ఓవర్లను చాలా మంది చిన్నచూపు చూస్తారు. కానీ మెయిడిన్లు వేయడం చాలా ముఖ్యం. ఒకవైపు బుమ్రా దాడి చేస్తూ పోతే, మరో ఎండ్‌లో ఇతర బౌలర్లు మెయిడిన్లు వేయాలి. పరుగులు ఇవ్వకూడదు. అప్పుడు గానీ ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెరగదు. అదృష్టం వెక్కిరించడంతో గత మ్యాచ్‌లో సిరాజ్ ఎక్కువ వికెట్లు తీయలేకపోయాడు. బ్రేక్ త్రూలు ఇవ్వలేకపోయినా ధైర్యం కోల్పోకుండా బౌలింగ్ చేస్తూ పోవాలి’ అని అశ్విన్ సూచించాడు.


ఇవీ చదవండి:

స్టోక్స్ మాటలు వింటే గూస్‌బంప్స్!

ఆ రోజే నా కెరీర్ క్లోజ్

బుమ్రా ఆడేనా

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 02 , 2025 | 11:13 AM