Jasprit Bumrah On Criticism: డబ్బుల కోసమే ఇలా చేస్తున్నారు.. బుమ్రా సంచలన వ్యాఖ్యలు!
ABN , Publish Date - Jul 12 , 2025 | 08:55 AM
డబ్బులు కోసమే ఇలా చేస్తున్నారంటూ టీమిండియా స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు బుమ్రా ఎవర్ని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా మరోమారు విమర్శకులపై సీరియస్ అయ్యాడు. వాళ్లకు సంచలన వార్తలు, వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ కావాలంటూ గరంగరం అయ్యాడు. తన వల్ల వాళ్లు డబ్బులు కూడగట్టుకుంటున్నారని చెప్పాడు. వాళ్లకు మనీ వస్తున్నాయంటే సంతోషిస్తానని తెలిపాడు. లార్డ్స్ టెస్ట్ రెండో రోజు ఆట ముగిశాక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు బుమ్రా. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టాడు భారత స్పీడ్‌స్టర్. 5 వికెట్లతో ఆతిథ్య జట్టు నడ్డి విరిచాడు. స్టోక్స్ సేనను 400 పరుగులు దాటకుండా అడ్డుకున్నాడు. డే-2 ఆట ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన బుమ్రా.. విమర్శకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అతడేం అన్నాాడంటే..
వాళ్లకు అదే కావాలి..
‘ప్రతి ఒక్కరికీ సెన్సేషనల్ న్యూస్, వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ కావాలి. ఈ విషయంలో ఎవ్వర్నీ ఏమీ అనలేం. ఒకవేళ వాళ్లు గనుక నా వల్ల బాగా డబ్బులు సంపాదిస్తున్నట్లయితే నాకు సంతోషమే. అది మంచి విషయమే. వాళ్ల ఆశీస్సులు నాకు ఉంటాయని భావిస్తున్నా. నేను క్రికెట్ ఆడినన్ని రోజులు, భారత జెర్సీ వేసుకున్నంత వరకు, వాళ్లు నన్ను జడ్జ్ చేస్తూనే ఉంటారు’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. కెరీర్ ఆరంభం నుంచి తనపై విమర్శలు రావడం చూస్తూనే ఉన్నానని.. ఇవేవీ పట్టించుకోనన్నాడు. తన పని తాను చేసుకుంటూ వెళ్తానని స్పష్టం చేశాడు.
నో సెలబ్రేషన్..
లార్డ్స్ టెస్ట్‌లో 5 వికెట్లు తీశాక బుమ్రా సెలబ్రేట్ చేసుకోలేదు. సాధారణంగా టెస్టుల్లో ఫైవ్ వికెట్ హాల్ తీసుకుంటే ఏ బౌలర్ అయినా సెలబ్రేట్ చేసుకుంటారు. అందునా క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన లార్డ్స్‌లో ఆ ఫీట్‌ను అందుకుంటే వారి ఆనందానికి హద్దులు ఉండవు. ఈ ఘనత సాధించిన బౌలర్ పేరును స్టేడియంలోని హానర్స్ బోర్డులో చేరుస్తారు. అందుకే ఇక్కడ ఫైవ్ వికెట్ హాల్ తీయాలని చాలా మంది బౌలర్లు కలలు కంటారు. అయితే బుమ్రా మాత్రం 5 వికెట్లు తీశాక కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. దీనిపై అతడు స్పందిస్తూ.. తాను అలసిపోయానని, అందుకే సెలబ్రేట్ చేసుకోలేదన్నాడు. గాల్లో ఎగురుతూ సెలబ్రేట్ చేసుకోవడానికి తాను 21 ఏళ్ల కుర్రాడ్ని కాదన్నాడు.
ఇవీ చదవండి:
ఇటలీకి టీ20 ప్రపంచకప్ బెర్త్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి