Share News

Ben Duckett Century: టీమిండియాను వదలని డకెట్.. జిడ్డులా తగులుకున్నాడు!

ABN , Publish Date - Jun 24 , 2025 | 07:26 PM

ఒక ఇంగ్లండ్ బ్యాటర్ భారత జట్టును జిడ్డులా తగులుకున్నాడు. టీమిండియాతో మ్యాచ్‌ అంటే చెలరేగే ఈ ఇంగ్లీష్ ఓపెనర్.. లీడ్స్ టెస్ట్‌లోనూ నిలకడగా రాణిస్తూ మనకు విజయాన్ని దూరం చేసే పనిలో పడ్డాడు.

Ben Duckett Century: టీమిండియాను వదలని డకెట్.. జిడ్డులా తగులుకున్నాడు!
Ben Duckett

లీడ్స్ టెస్ట్‌లో తడబడుతోంది భారత్. నాల్రోజులు ఇంగ్లండ్‌తో ఢీ అంటే ఢీ అంటూ తలపడిన టీమిండియా.. ఐదో రోజు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. ప్రత్యర్థి బ్యాటర్లను ఔట్ చేయడంలో విఫలమవుతోంది. ముఖ్యంగా ఓ బ్యాటర్ మన బౌలర్లతో ఆటాడుకుంటున్నాడు. బౌండరీల మీద బౌండరీలు కొడుతూ మెన్ ఇన్ బ్లూను భయాందోళనలకు గురిచేస్తున్నాడు. అతడే ఇంగ్లీష్ ఓపెనర్ బెన్ డకెట్. భారత్ నుంచి మ్యాచ్‌ను దూరం చేస్తున్నాడీ ఆతిథ్య జట్టు బ్యాటర్.

duckett


దూకుడు మంత్రంతో..

తొలి టెస్ట్ ఆఖరి రోజు ఆరంభం నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు బెన్ డకెట్. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌లో డిఫెన్స్‌కు వెళ్లినా.. ఇతర బౌలర్లను మాత్రం శిక్షించాడీ ఓపెనర్. వరుస ఫోర్లతో భయపెట్టాడు. శతకం బాదిన డకెట్.. ఇప్పుడు 126 బంతుల్లో 105 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఇందులో 14 బౌండరీలు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులతో సత్తా చాటిన ఓపెనర్.. ఇప్పుడు సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలే (121 బంతుల్లో 59 నాటౌట్)తో కలసి స్కోరు బోర్డును అతడు పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం వికెట్లేమీ కోల్పోకుండా 181 పరుగులతో ఉంది ఇంగ్లండ్. డకెట్-క్రాలే జోరు చూస్తుంటే ఇద్దరే కథ ముగించేలా కనిపిస్తున్నారు. వాళ్లను గానీ ఔట్ చేయకపోతే భారత్‌కు ఘోర పరాభవం తప్పేలా లేదు. డకెట్ ఇలా తగులుకున్నాడేంటి అంటూ టీమిండియా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా అతడ్ని ఔట్ చేయాలని కోరుతున్నారు. మ్యాచ్ పోయినా డకెట్‌ను వదలొద్దని చెబుతున్నారు.


ఇవీ చదవండి:

లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొన్న దూబె

కౌంటీల్లో దుమ్మురేపిన తెలుగోడు

కేఎల్ రాహుల్ కష్టం చూస్తే..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 24 , 2025 | 07:37 PM