India Target: టెంప్టింగ్ టార్గెట్.. ఉఫ్‌మని ఊదేస్తారా.. కవ్వింపులకు పడిపోతారా..
ABN , Publish Date - Mar 09 , 2025 | 06:19 PM
IND vs NZ Chasing Target: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్ అయిపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ టెంప్టింగ్ టార్గెట్‌ను భారత్ ముందు ఉంచింది.

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. అటు భారత్, ఇటు న్యూజిలాండ్ నువ్వానేనా అంటూ తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), మైకేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) రాణించడంతో భారత్ ముందు టెంప్టింగ్ టార్గెట్‌ను ఉంచగలిగింది బ్లాక్‌క్యాప్స్. ఒకదశలో 165 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ప్రత్యర్థి జట్టు.. బ్రేస్‌వెల్ పట్టుదలతో ఆడటంతో మంచి లక్ష్యాన్ని రోహిత్ సేన ముందు ఉంచగలిగింది. అయితే చేజింగ్ అంత ఈజీగా కనిపించడం లేదు.
భరోసా ఇస్తున్న రికార్డులు
దుబాయ్ పిచ్ మీద 251 అంటే బిగ్ స్కోరే. స్పిన్నర్లు చెలరేగే ఈ గ్రౌండ్‌లో ఛేదన అంత ఈజీ కాదు. అయితే టీమిండియా బ్యాటర్లు మంచి కాక మీద ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటిదాకా ఇక్కడ ఆడిన 4 మ్యాచుల్లో భారత్ మూడుసార్లు చేజ్ చేసి గెలిచింది. అందులో ఒకసారి 228 రన్స్, మరో మ్యాచ్‌లో 241 పరుగులు ఛేదించింది. సెమీఫైనల్‌లో ఆసీస్‌పై ఏకంగా 264 పరుగులు ఛేజ్ చేసి ఫైనల్స్‌కు దూసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కివీస్ సంధించిన 251 పరుగుల టార్గెట్ చేజ్ చేయడం కష్టమేమీ కాదు. అయితే బంతి టర్న్ అవుతున్న నేపథ్యంలో శాంట్నర్, రచిన్ లాంటి స్పిన్నర్లను తట్టుకొని నిలబడితే చాలు.. ఆ లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేయొచ్చు.
ఇవీ చదవండి:
గర్ల్‌ఫ్రెండ్‌తో చాహల్.. అందరి ముందే..
రెచ్చిపోతున్న స్పిన్నర్లు.. కివీస్‌ను కాచుకోగలమా..
కివీస్‌కు చుక్కలు చూపిస్తున్న కుల్దీప్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి