Share News

Shubman Gill Record: గిల్ క్రేజీ రికార్డ్.. విరాట్ కోహ్లీని దాటేశాడు!

ABN , Publish Date - Jul 12 , 2025 | 10:18 AM

భారత జట్టు నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని దాటేశాడు కొత్త సారథి. ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Shubman Gill Record: గిల్ క్రేజీ రికార్డ్.. విరాట్ కోహ్లీని దాటేశాడు!
Shubman Gill

భారత టెస్ట్ జట్టు నూతన సారథి శుబ్‌మన్ గిల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. టీమిండియా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అతడి బ్యాట్ ఒక రేంజ్‌లో గర్జిస్తోంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు గిల్. ఈ క్రమంలో పలు పాత రికార్డులకు పాతర పెడుతూ పోతున్నాడు. లార్డ్స్ టెస్ట్‌లో మరో క్రేజీ రికార్డు సృష్టించాడు శుబ్‌మన్. ఏకంగా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును అతడు అధిగమించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 585 పరుగులు చేసిన గిల్.. లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మరో 16 పరుగులు చేశాడు. దీంతో 601 పరుగులకు చేరుకున్నాడు. తద్వారా ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు.


దాటేయడం ఖాయం..

ఇంగ్లండ్ గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు బాదిన వారి లిస్ట్‌లో లెజెండ్ రాహుల్ ద్రవిడ్ (4 ఇన్నింగ్స్‌ల్లో 602 పరుగులు) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో గిల్ (601) నిలిచాడు. శుబ్‌మన్ తర్వాతి స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లీ (593), సునీల్ గవాస్కర్ (542) ఉన్నారు. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (5 మ్యాచుల్లో 712 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచులు ఉన్నందున జైస్వాల్‌ను గిల్ అలవోకగా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.


రిపీట్ అవ్వని మ్యాజిక్..

ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో అదరగొట్టిన గిల్.. మూడో టెస్ట్‌లో మాత్రం విఫలమయ్యాడు. లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 16 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు గిల్. స్పీడ్‌స్టర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే గిల్ ఔట్ అయినా ఒక ఎండ్‌లో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (53 నాటౌట్), మరో ఎండ్‌లో పించ్ హిట్టర్ రిషబ్ పంత్ (19 నాటౌట్) గట్టిగా నిలబడ్డారు. రెండో రోజు ఆటను విజయవంతంగా ముగించారు.


ఇవీ చదవండి:

డబ్బుల కోసమే ఇలా చేస్తున్నారు!

విహార యాత్ర కోసం రాలేదు

ఇటలీకి టీ20 ప్రపంచకప్‌ బెర్త్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 12 , 2025 | 10:18 AM