Ravindra Jadeja Sentiment: ఒకే స్కోరుపై 7 సార్లు ఔట్.. జడేజాను వదలని శని!
ABN , Publish Date - Jul 04 , 2025 | 02:49 PM
టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన మీద అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో బ్యాట్‌తో చెలరేగిపోయాడు జడ్డూ.

భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చెలరేగి ఆడాడు. ఈ మధ్య కాలంలో అటు బౌలింగ్‌లో సత్తా చాటలేక, ఇటు బ్యాటింగ్‌లోనూ విఫలమవుతూ తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్న జడేజా ఎట్టకేలకు గాడిన పడ్డాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగుల సూపర్బ్ నాక్ ఆడాడు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (269)తో కలసి ఆరో వికెట్‌కు 203 పరుగులు జోడించాడు. మ్యాచ్ ఫలితాన్ని టీమిండియా నిర్ణయించే స్థాయికి తీసుకెళ్లాడు. అంతా బాగానే ఉన్నా జడ్డూ సెంచరీ మిస్ అవడం అభిమానుల్ని నిరాశకు గురిచేస్తోంది. నంబర్ 80 ఈ ఆల్‌రౌండర్‌ను వదలకపోవడం ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోంది. ఇంకెన్ని శతకాలు మిస్ చేస్తుందోననే భయం పెంచుతోంది.
ఏకంగా 7 సార్లు..
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో జడేజా 89 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. ఇంకో 11 పరుగులు చేస్తే అతడు సెంచరీ మార్క్‌ను అందుకునేవాడు. జడ్డూ 80ల్లో ఔట్ అవడం ఇదేమీ తొలిసారి కాదు. టెస్టుల్లో 80 నుంచి 90 స్కోర్ల మధ్య అతడు ఔట్ అవడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. ఆ లెక్కన 7 సెంచరీలు అతడు మిస్ చేసుకున్నట్లే. దీనిపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. 80 నంబర్ జడేజాను వదలడం లేదని అన్నాడు.
బ్యాడ్ లక్..
‘మళ్లీ 80 ప్లస్ స్కోరు చేశాకే జడేజా ఔట్ అయ్యాడు. ఎనభైలు అతడ్ని వదలడం లేదు. టెస్ట్ క్రికెట్‌లో అతడు ఎన్నోసార్లు 80 ప్లస్ స్కోర్లు చేశాడు. ఇంకోసారి అదే మార్క్ వద్ద వికెట్ పారేసుకున్నాడు. అతడు సెంచరీ కొడితే చాలా బాగుండేది. ఏదేమైనా అతడు బాగా ఆడాడు, మంచి భాగస్వామ్యం అందించాడు. ఎంతో బాధ్యతగా బ్యాటింగ్ చేశాడు. గిల్‌తో కలసి అతడు అందించిన పార్ట్‌నర్‌షిప్ వల్లే టీమిండియా అంత భారీ స్కోరు చేయగలిగింది’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్స్.. పాపం నంబర్ 80 జడ్డూను వదలడం లేదని అంటున్నారు. దీన్ని అతడు అధిగమించాలని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి