Nitish Kumar Reddy: ప్లేయింగ్ 11లోకి తెలుగోడు.. టీమిండియాలో మార్పులు పక్కా..!
ABN , Publish Date - Jul 01 , 2025 | 02:58 PM
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ కోసం సన్నద్ధమవుతున్న భారత్.. ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలుస్తోంది. తెలుగోడితో పాటు ఇంకొందరు ఆటగాళ్లను బరిలోకి దించనున్నట్లు సమాచారం.

ఇంగ్లండ్ పర్యటనలో బోణీ కొట్టాలని తహతహలాడుతోంది టీమిండియా. లీడ్స్ టెస్ట్‌లో అనూహ్య ఓటమితో నిరాశకు గురైన గిల్ సేన.. ఆతిథ్య జట్టును చావుదెబ్బ తీయాలని చూస్తోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌ను అందుకోసం వినియోగించుకోవాలని భావిస్తోంది. భారీ విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలనే పట్టుదలతో కనిపిస్తోంది మెన్ ఇన్ బ్లూ. ఇందులో భాగంగానే ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులోకి తీసుకోవడం ఖాయమని వినిపిస్తోంది. టీమ్‌లో ఇంకేం మార్పులు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
ఇద్దరు ఇన్.. ఇద్దరు ఔట్!
పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ తొలి టెస్ట్‌లో అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. దీంతో అతడి స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా నితీష్‌ను దించేందుకు గంభీర్-గిల్ ప్లాన్ చేస్తున్నారట. తెలుగోడితో అవసరమైనప్పుడు కొన్ని ఓవర్లు కూడా బౌలింగ్ చేయించాలని భావిస్తున్నారట. నితీష్ రెడ్డితో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌నూ తుది జట్టులోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారని సమాచారం. పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చి, అతడి స్థానంలో సుందర్‌ను రీప్లేస్ చేస్తారని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. లీడ్స్ టెస్ట్‌లో మిడిలార్డర్ ఫెయిలైనందున నితీష్-సుందర్‌తో ఆ విభాగాన్ని బలోపేతం చేస్తున్నారని తెలుస్తోంది. వీళ్లు బంతితోనూ మ్యాజిక్ చేయగలగడం బిగ్ ప్లస్‌గా టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. ఈ రెండు మార్పులు తప్పితే ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇంకేమీ చేంజెస్ చేయడం లేదని వినిపిస్తోంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి