Share News

ICC: ట్రోఫీ సెర్మనీకి పాక్ డుమ్మా.. తెగ్గొట్టిన ఐసీసీ

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:45 PM

ICC Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ-2025 ముగిసినా టోర్నమెంట్‌కు సంబంధించి ఏదో ఒక వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వీటికి చెక్ పెట్టింది ఐసీసీ.

ICC: ట్రోఫీ సెర్మనీకి పాక్ డుమ్మా.. తెగ్గొట్టిన ఐసీసీ
Chamapions Trophy 2025

చాంపియన్స్ ట్రోఫీ-2025 ఎట్టకేలకు ముగిసింది. మూడు వారాల పాటు క్రికెట్ లవర్స్‌ను విశేషంగా అలరించిన ఈ టోర్నమెంట్ పూర్తవడంతో ఇప్పుడు ఇతర సిరీస్‌లు, టోర్నీలపై ఫోకస్ చేస్తున్నారు అభిమానులు. భారత్ కప్పు గెలవడంతో ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. మరోవైపు టీమిండియా స్టార్లు దుబాయ్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. నెక్స్ట్ ఐపీఎల్-2025 మీద దృష్టి సారిస్తున్నారు. ఇలా అటు అభిమానులు, ఇటు ఆటగాళ్లు టోర్నమెంట్ నుంచి ఇతర విషయాలపై ఫోకస్‌ను షిఫ్ట్ చేస్తున్నారు. కానీ చాంపియన్స్ ట్రోఫీ చుట్టూ ముసురుకున్న వివాదాలు తగ్గడం లేదు.


దుబాయ్‌లోనే ఉన్నా..

చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మెగా టోర్నీని సరిగ్గా నిర్వహించలేక విమర్శలపాలైన దాయాది.. భారత్ తమ దేశానికి రాలేదనే కోపంతో రగిలిపోయింది. దీంతో ఫైనల్ మ్యాచ్‌కు పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఎవరూ హాజరు కాలేదు. పీసీబీ సీఈవో ఫైసల్ హుస్నేయిన్ దుబాయ్‌లోనే ఉన్నా మ్యాచ్‌కు, ట్రోఫీ ప్రెజెంటేషన్ ఈవెంట్‌కు హాజరవ్వలేదు. దీంతో పీసీబీ అధికారులు కావాలనే రాలేదని.. పాక్‌ బుద్ధి చూపించారంటూ ట్రోలింగ్ నడిచింది. అయితే ఎట్టకేలకు ఈ విషయాన్ని తెగ్గొట్టింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ట్రోఫీ సెర్మనీకి పాక్ బోర్డు నుంచి ఎవరూ అటెండ్ అవ్వకపోవడంపై క్లారిటీ ఇచ్చింది.


కారణం అదే..

ఫైనల్ మ్యాచ్ ట్రోఫీ ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్‌కు పీసీబీ చైర్మన్ మోసిన్ నక్వీ రాకపోవడం వెనుక కారణాన్ని తెలిపింది ఐసీసీ. ఆయన అందుబాటులో లేకపోవడం వల్లే కార్యక్రమానికి హాజరు కాలేదని పేర్కొంది. సాధారణంగా ట్రోఫీ బహూకరణకు ఆఫీస్ బేరర్లు వస్తారని.. అయితే ఆ సమయానికి పీసీబీ ఆఫీస్ బేరర్లు అవేలబుల్‌గా లేకపోవడంతో రాలేకపోయారని ఐసీసీ ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది. కాగా, భద్రతా కారణాల రీత్యా పాక్‌లో భారత్ ఆడకపోవడం తెలిసిందే. టీమిండియా మ్యాచులన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లో నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ కూడా అక్కడే జరిగింది.


ఇవీ చదవండి:

దుబాయ్ నుంచి సైలెంట్‌గా ఇళ్లకు..

నా నెక్స్ట్ టార్గెట్ అదే: రోహిత్

చాంపియన్స్ ట్రోఫీ హీరో.. ధీనగాథ తెలిస్తే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2025 | 02:07 PM