Share News

ICC New Rules: ఐసీసీ కొత్త రూల్స్.. గట్టిగా బిగిస్తున్నారు!

ABN , Publish Date - Jun 27 , 2025 | 05:31 PM

క్రికెట్‌‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా, ఎంగేజింగ్‌గా మార్చేందుకు కొత్త నిబంధనలు తీసుకొస్తూ ఉంటుంది ఐసీసీ. మరోమారు నయా రూల్స్ తెచ్చింది అత్యున్నత క్రికెట్ బోర్డు.

ICC New Rules: ఐసీసీ కొత్త రూల్స్.. గట్టిగా బిగిస్తున్నారు!
ICC New Rules

క్రికెట్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేందుకు, ఆడియెన్స్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను బెటర్ చేసేందుకు, ఆటను రసవత్తరంగా మార్చేందుకు ఎప్పటికప్పుడు నయా రూల్స్ తీసుకొస్తూ ఉంటుంది ఐసీసీ. ఒక్కోసారి ఉన్న నిబంధనలనే సడలించే అత్యున్నత క్రికెట్ బోర్డు.. అవసరాన్ని బట్టి నయా రూల్స్ కూడా తీసుకొస్తుంది. అలా తాజాగా కొన్ని పాత రూల్స్‌ను మార్చడమే గాక కొన్ని కొత్త నిబంధనలను కూడా ప్రవేశపెట్టింది ఐసీసీ. అవేంటో ఇప్పుడు చూద్దాం..


స్టాప్ క్లాక్

ఇప్పటివరకు వన్డేలు, టీ20ల్లో ఉన్న స్టాప్ క్లాక్ రూల్‌ను ఇకపై టెస్టుల్లోనూ అమలు చేయనున్నారు. ఇక మీదట ఓవర్ పూర్తయిన తర్వాత 60 సెకన్లలోనే తర్వాతి ఓవర్‌ను ప్రారంభించాలి. అలా జరగకపోతే రెండుసార్లు వార్నింగ్ ఇస్తారు. మూడోసారి కూడా రిపీట్ అయితే బౌలింగ్ జట్టుకు 5 పరుగులు పెనాల్టీ విధిస్తారు. 80వ ఓవర్ వరకు ఇలా ఎన్నిసార్లు జరిగితే అన్ని సార్లు పెనాల్టీ విధిస్తూనే వస్తారు.

ICC.jpg


ఒకే బంతి

వన్డేల్లో ఏ బంతిని ఎప్పుడు వాడాలనేది ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. 34 ఓవర్ల వరకు రెండు కొత్త బంతుల్ని వాడొచ్చని, ఆ తర్వాత అందులో నుంచి ఏ ఒక్క బంతిని మిగతా ఓవర్లకు ఉపయోగించాలనేది ఫీల్డింగ్ టీమ్ ఇష్టమని స్పష్టం చేసింది.

బౌండరీ క్యాచ్

బౌండరీ లైన్ దాటి గాల్లో బంతిని అందుకుంటే తిరిగి ఒకే ప్రయత్నంలో మైదానంలోకి విసరాలి. విసిరిన వెంటనే గ్రౌండ్‌లోకి వచ్చి క్యాచ్ అందుకోవాలి. లేకపోతే దాన్ని సిక్స్‌గా పరిగణిస్తారు.

షార్ట్ రన్

క్రీజులో బ్యాట్ పెట్టకుండా ఉద్దేశపూర్వకంగా రన్ పూర్తి చేయకపోతే 5 పరుగులు పెనాల్టీ విధిస్తారు. కావాలని ఇలా పరిగెడితే పెనాల్టీ విధించడమే కాదు.. ఇంకో మెలిక కూడా పెట్టింది ఐసీసీ. ఆ తర్వాతి బంతిని ఏ బ్యాటర్ ఆడాలనేది ఫీల్డింగ్ జట్టు నిర్ణయించేలా చేసింది.


డీఆర్ఎస్

ఇకపై కీపర్ పట్టిన ఔట్ల విషయంలో అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తాకిందా? లేదా ప్యాడ్‌కు తాకిందా? అనేది చూస్తారు. క్యాచ్ ఔట్ కాకపోతే ఎల్బీడబ్ల్యూ చెక్ చేస్తారు. బాల్ ట్రాకింగ్‌లో ఔట్ అని తేలితే మాత్రం బ్యాటర్ పెవిలియన్ దారి పట్టక తప్పదు.

కంకషన్ ప్రోటోకాల్స్

కంకషన్ ప్రోటోకాల్స్‌లో రెండు మార్పులు చేసింది ఐసీసీ. కంకషన్ రీప్లేస్‌మెంట్ ఎవరనేది ముందే జట్లు చెప్పాల్సి ఉంటుంది. మ్యాచ్ సమయంలో గాయపడి దూరమైన ఆటగాళ్లను 7 రోజుల పాటు గమనిస్తారు. కోలుకున్నారని తేలాకే వారిని తిరిగి ఆడేందుకు అనుమతిస్తారు.

రీప్లేస్‌మెంట్ ప్లేయర్స్

మ్యాచ్‌లో గాయపడిన ఆటగాళ్లను లైక్ ఫర్ లైక్ ప్లేయర్ రూల్ కింద రీప్లేస్‌మెంట్ చేస్తారు. ఉదాహరణకు బ్యాటర్‌కు గాయమైతే స్పెషలిస్ట్ బ్యాటర్‌నే రీప్లేస్ చేస్తారు.

ICC


వైడ్ బాల్

వైడ్ బాల్‌‌ రూల్‌లో మార్పులు చేయాలని చూస్తోంది ఐసీసీ. దీంట్లో భాగంగా బంతిని ఆడే సమయంలో బ్యాటర్ కాళ్ల పొజిషన్‌ను అంపైర్లు గమనిస్తారు. ఆఫ్ సైడ్ బ్యాటర్ జరుగుతున్నాడా? దీని వల్ల వైడ్ మీద ఎఫెక్ట్ పడిందా? అనేది చూస్తారు. వీటిని పరిగణనలోకి తీసుకొని వైడ్‌గా ఇవ్వాలా? లేదా? అనేది నిర్ణయిస్తారు. అయితే ఈ రూల్‌ను కొన్నాళ్ల పాటు పరీక్షిస్తారు. ట్రయల్స్ విజయవంతమైతే అమల్లోకి తీసుకొస్తారు. ఈ నిబంధన మీద అప్పుడే పూర్తి స్పష్టత రానుంది. కాగా, ఈ కొత్త రూల్స్‌తో బ్యాటర్లకు కష్టమేనని, ఫీల్డర్లకు కూడా ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు.


ఇవీ చదవండి:

టీమిండియా తిరుగులేని స్కెచ్

ఇది బీచా.. క్రికెట్ స్టేడియమా?

థర్డ్ అంపైర్ చెత్త నిర్ణయాలు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 27 , 2025 | 05:46 PM