Share News

Brook-Siraj: బ్రూక్‌తో సిరాజ్ ఫైట్.. అంపైర్ ముందే మాటకు మాట!

ABN , Publish Date - Jun 22 , 2025 | 08:08 PM

లీడ్స్ టెస్ట్ సెషన్‌ సెషన్‌కూ మరింత హీటెక్కుతోంది. ప్రతి పరుగు కీలకంగా మారడంతో ప్లేయర్లు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు. ఈ హీట్‌ కాస్తా గొడవకు దారితీస్తోంది.

Brook-Siraj: బ్రూక్‌తో సిరాజ్ ఫైట్.. అంపైర్ ముందే మాటకు మాట!
Mohammed Siraj

భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సెషన్ సెషన్‌కూ మరింత హీటెక్కుతోంది. ఇరు జట్లు నువ్వానేనా అంటూ తలపడుతుండటంతో ఆధిపత్యం చేతులు మారుతూ పోతోంది. మొదటి రోజు టీమిండియా బ్యాటర్లు చెలరేగితే.. రెండో రోజు సాయంత్రం నుంచి ఆతిథ్య జట్టు బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. మూడో రోజు కూడా ఇంగ్లీష్ ప్లేయర్లు తగ్గేదేలే అంటూ బ్యాట్లతో విరుచుకుపడుతున్నారు. అయితే వాళ్ల జోరుకు సాధ్యమైనంతగా బ్రేకులు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు భారత బౌలర్లు. అయితే మ్యాచ్ హీట్‌లో ఇద్దరు క్రికెటర్లు ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


ఒకరి కళ్లలోకి ఒకరు..

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 84వ ఓవర్‌ వేసేందుకు వచ్చిన సిరాజ్ నాలుగు బంతులు బాగానే బౌలింగ్ చేశాడు. కానీ ఐదో బంతికి అతడికి బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మియా వేసిన బంతిని షాట్ కొడదామని ప్రయత్నించి విఫలమయ్యాడు ఇంగ్లండ్ బ్యాటర్. ఆ బంతి కాస్తా అతడి మోచేతికి తగిలింది. దీంతో అతడు సిరాజ్ వైపు సీరియస్‌గా చూశాడు. ఎందుకలా చూస్తున్నావంటూ బ్రూక్‌ను ఏదో అన్నాడు భారత పేసర్. బ్రూక్ కూడా ప్రతిస్పందించడంతో సిరాజ్ అతడ్ని మరింత రెచ్చగొట్టాడు. ఒకరి కళ్లలోకి ఒకరు సీరియస్‌గా చూసుకున్నారు. అంపైర్ ముందే ఇదంతా జరగడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


ఒక్క పరుగు తేడాలో..

సిరాజ్‌తో గొడవకు దిగిన బ్రూక్ ఆ తర్వాత రెండు ఓవర్ల వ్యవధిలోనే ఔటై పెవిలియన్‌కు చేరుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 99 పరుగుల వద్ద ప్రసిద్ధ్‌కు దొరికిపోయాడతను. ఒక్క పరుగు తేడాతో అతడు సెంచరీ చేసే చాన్స్‌ను మిస్ చేసుకున్నాడు. దీంతో సిరాజ్‌తో ఫైట్ వల్లే అతడు సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడని నెటిజన్స్ అంటున్నారు. మియా నేరుగా ఔట్ చేయకపోయినా.. బ్రూక్‌ ఏకాగ్రతను దెబ్బతీశాడని చెబుతున్నారు. ఇదంతా ఆటలో భాగమేనని.. టెస్ట్ క్రికెట్‌లో ఇలాంటివి సర్వసాధారణమని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.


ఇవీ చదవండి:

మాట వినని అంపైర్

స్టోక్స్‌కు దిమ్మతిరిగేలా చేసిన సిరాజ్

నల్లరిబ్బన్లు ఎందుకు కట్టుకున్నారంటే..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 22 , 2025 | 08:13 PM