Share News

Gerhard Erasmus: అనామక ఆటగాడికి ఐసీసీ అవార్డు.. క్రెడిట్ అంతా అశ్విన్‌కే

ABN , Publish Date - Jan 27 , 2025 | 06:49 PM

Gerhard Erasmus Gets ICC Award: ఓ అనామక ఆటగాడు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే అతడు ఈ పురస్కారం అందుకోవడం వెనుక టీమిండియా లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ పాత్ర ఉండటం విశేషం.

Gerhard Erasmus: అనామక ఆటగాడికి ఐసీసీ అవార్డు.. క్రెడిట్ అంతా అశ్విన్‌కే
Gerhard Erasmus

క్రికెట్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇచ్చే పురస్కారాలను అత్యుత్తమంగా భావిస్తారు. ప్రతి ఏడాది ఫార్మాట్లను బట్టి ఏయే ఆటగాడు ఎలా పెర్ఫార్మ్ చేశాడో చూసి.. బెస్ట్ ప్లేయర్లకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటుంది టాప్ బోర్డు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా పురస్కారాలు ఇచ్చింది. మెన్స్ క్రికెట్‌తో పాటు విమెన్స్ క్రికెట్‌లోనూ అవార్డులను ప్రకటించింది. అయితే అనూహ్య రీతిలో ఓ అనామక ఆటగాడికి పురస్కారం వరించింది. బచ్చా ప్లేయర్ అవార్డు కొట్టేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే అతడికి అవార్డు రావడంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రోల్ ఉందని తెలిసి మరింత అవాక్కయ్యారు. ఇంతకీ పురస్కారం దక్కించుకున్న ఆ ఆటగాడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..


అశ్విన్‌ స్ఫూర్తితో..

నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ మెన్స్ అసోసియేట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు అతడు ఎంపికయ్యాడు. 2024 సంవత్సరంలో 12 వన్డేల్లో 364 పరుగులు చేశాడు ఎరాస్మస్. అలాగే 18 వికెట్లు పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్‌లో 363 పరుగులు చేయడమే గాక 18 వికెట్లు తీశాడు. స్టన్నింగ్ బ్యాటింగ్‌తో అసోసియేట్ నేషన్స్‌తో పాటు బిగ్ టీమ్స్‌కు కూడా అతడు హెచ్చరికలు పంపించాడు. అతడి పెర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన ఐసీసీ.. అవార్డు ఇచ్చి ప్రోత్సహించింది. అయితే అతడు ఈ స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం వెనుక సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్‌తో పాటు భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రోల్ ఉంది. వీళ్లిద్దరి స్ఫూర్తితోనే తాను ఇంతలా చెలరేగుతున్నానని అతడు అన్నాడు.


ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్!

అశ్విన్ డైరెక్ట్‌గా సాయం చేయకపోయినా అతడు బౌలింగ్ చేసే తీరు, బంతిని టర్న్ చేసే విధానం, వేరియేషన్స్‌ను చూసి తాను ఎంతో ఇన్‌స్పైర్ అయ్యానని ఎరాస్మస్ అన్నాడు. అశ్విన్‌లాగే తాను ఆలోచిస్తానని చెప్పాడు. క్రికెట్‌ను వినూత్నంగా చూడటం, ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచిస్తూ వైవిధ్యమైన వ్యూహాలు పన్నడంలో తాము ఒకే లాంటి వారమని తెలిపాడు. స్కిల్స్‌ను మెరుగుపర్చుకుంటూ వెళ్లే విషయంలోనూ అశ్విన్‌ తనకు ఇన్‌స్పిరేషన్ అని పేర్కొన్నాడు ఎరాస్మస్. బ్యాటింగ్‌లో డివిలియర్స్‌ను అనుసరిస్తానని చెప్పుకొచ్చాడు. కాగా, సంచలన ఇన్నింగ్స్‌లతో నమీబియా పేరు మార్మోగేలా చేస్తున్న ఎరాస్మస్.. గతేడాది ఆఖర్లో నిర్వహించిన ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.


ఇవీ చదవండి:

కుర్ర బ్యాటర్ ఊచకోత.. ఏకంగా 11 సిక్సులు.. ఈ బాదుడు చూడాల్సిందే

ఒక్క వన్డే ఆడకుండానే చాంపియన్స్ ట్రోఫీకి.. రోహిత్ ధైర్యానికి సెల్యూట్

బుమ్రాకు ప్రతిష్టాత్మక పురస్కారం.. తొలి బౌలర్‌గా రికార్డు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 27 , 2025 | 06:56 PM