Gautam Gambhir: టీమిండియా కోసం గంభీర్ త్యాగం.. కోచ్ అంటే ఇలా ఉండాలి!
ABN , Publish Date - Jun 16 , 2025 | 03:51 PM
భారత జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ తిరిగి ఇంగ్లండ్‌కు వెళ్తున్నాడని తెలుస్తోంది. ఉన్నపళంగా గౌతీ స్వదేశానికి ఎందుకు వచ్చాడు? మళ్లీ తిరుగు ప్రయాణం ఎందుకు అవుతున్నాడు? అనేది ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు తొలి టెస్ట్ కోసం జోరుగా సన్నద్ధమవుతోంది. మరో నాల్రోజుల్లో 5 టెస్టుల సిరీస్ మొదలుకానుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజాల గైర్హాజరీలో ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో అదరగొట్టాలని చూస్తోంది మెన్ ఇన్ బ్లూ. కుర్రాళ్లతో నిండిన టీమిండియా ఆతిథ్య జట్టుకు గట్టి షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఈ తరుణంలో హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఉన్నపళంగా భారత్‌కు పయనమయ్యాడు. దీంతో నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ జట్టును తాత్కాలికంగా నడిపించే బాధ్యతలు తీసుకున్నాడు. అయితే భారత జట్టు కోసం త్యాగం చేసిన గంభీర్.. తిరిగి లండన్ ఫ్లైట్ ఎక్కుతున్నాడట. అసలేం జరిగిందంటే..
తిరుగు పయనం..
గౌతీ తల్లి సీమా గంభీర్ ఇటీవల కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు. జూన్ 11వ తేదీ (బుధవారం)న ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. దీంతో లండన్‌లో ఉన్న భారత హెడ్ కోచ్.. తల్లి అనారోగ్యం గురించి తెలియగానే స్వదేశానికి పయనమయ్యాడు. మూడ్రోజుల నుంచి తల్లితోనే ఉన్నాడు గంభీర్. ఆమె ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని తెలుస్తోంది. ఈ సమయంలో గౌతీ లండన్‌కు తిరిగి పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. తల్లి ఇంకా పూర్తిగా కోలుకోకపోయినా భారత జట్టు కోసం అతడు తిరిగి ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడట.
ఇంకా ఐసీయూలోనే..
కార్డియాక్ అరెస్ట్‌కు గురైన గంభీర్ తల్లి వేగంగా కోలుకుంటున్నారని తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ప్రస్తుతం ఐసీయూలో ఉంచి మానిటర్ చేస్తున్నారని.. త్వరలోనే సాధారణ వార్డుకు షిఫ్ట్ చేస్తారని సమాచారం. అయితే ఈ నెల 20వ తేదీన భారత్-ఇంగ్లండ్ సిరీస్ ఆరంభం కానుంది. హెడింగ్లేలో జరిగే ఈ మ్యాచ్ సమయానికి టీమ్‌తో చేరాలని గంభీర్ భావిస్తున్నాడట. సీనియర్లు లేకపోవడం, కొత్త కెప్టెన్ గిల్ సహా జట్టులో ఎక్కువగా యువకులే ఉండటంతో తల్లి ఐసీయూలోనే ఉన్నా గంభీర్ లండన్‌కు తిరుగు పయనమవుతున్నాడని వినిపిస్తోంది. ఇది తెలిసిన నెటిజన్స్.. గౌతీ పట్టుదట, కర్తవ్య నిర్వహణ, జట్టుపై అతడికి ఉన్న ప్రేమ, గౌరవం అదుర్స్ అని మెచ్చుకుంటున్నారు. కోచ్ అంటే ఇలా ఉండాలని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
ఇవీ చదవండి:
నన్ను రిటైర్ అవ్వమన్నాడు: కరుణ్ నాయర్
కూతుర్ని పెళ్లి చేసుకోమని కోహ్లీని అడిగా
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి