Share News

Faf Du Plessis: చరిత్ర సృష్టించిన డుప్లెసిస్.. 40 ఏళ్ల వయసులో..

ABN , Publish Date - Jun 30 , 2025 | 09:01 AM

విధ్వంసక బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ చరిత్ర సృష్టించాడు. 40 ఏళ్ల వయసులో ఎవరికీ అందని ఓ రేర్ రికార్డ్‌ను అతడు అందుకున్నాడు. మరి.. ఆ ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం..

Faf Du Plessis: చరిత్ర సృష్టించిన డుప్లెసిస్.. 40 ఏళ్ల వయసులో..
Faf Du Plessis

40 ఏళ్లు.. క్రికెట్‌లో ఇది రిటైర్‌మెంట్ ఏజ్ అనే చెప్పాలి. కొందరు ప్లేయర్లు 36 నుంచి 40 ఏళ్ల లోపు రిటైరైతే, మరికొందరు 40 దాటాక కెరీర్‌కు గుడ్‌బై చెబుతుంటారు. బ్యాటర్లలో ఎక్కువ వరకు నలభై వచ్చే లోపే ఆట నుంచి నిష్క్రమిస్తుంటారు. ఆ వయసులో హ్యాండ్ ఐ కో-ఆర్డినేషన్, ఫిట్‌నెస్‌ను మెయింటెయిన్ చేస్తూ పోటీతత్వాన్ని తట్టుకొని గేమ్‌లో కొనసాగడం అంత సులువు కాదు. అయితే సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ మాత్రం ఆటకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నాడు. రిటైర్ అయ్యే వయసులో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా అద్భుత సెంచరీతో చరిత్ర సృష్టించాడు. మరి.. డుప్లెసిస్ సాధించిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..


రోహిత్‌తో సమం..

మేజర్ లీగ్ క్రికెట్-2025లో శతకంతో మెరిశాడు డుప్లెసిస్. టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న ఫాఫ్.. ఎంఐ న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 103 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 5 బౌండరీలు, 9 భారీ సిక్సులు ఉన్నాయి. 194 స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన డుప్లెసిస్.. ట్రెంట్ బౌల్ట్ సహా ప్రత్యర్థి బౌలర్లందర్నీ బాది పారేశాడు. ఈ క్రమంలో శతకం మార్క్‌ను అందుకున్నాడు. అతడి టీ20 కెరీర్‌లో ఇది 8వ సెంచరీ కావడం విశేషం.


అందనంత ఎత్తులో..

పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్ల జాబితాలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (8 సెంచరీలు), ఇంగ్లండ్ టాప్ బ్యాటర్ జోస్ బట్లర్‌ (8 సెంచరీలు)తో కలసి సంయుక్తంగా ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు డుప్లెసిస్. అదే సమయంలో మేజర్ క్రికెట్ లీగ్‌లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా అతడు నెవర్ బిఫోర్ రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్లపై శతకాలు బాదిన ఫాఫ్.. ఎంఐపై తాజా సెంచరీతో ఎంఎల్‌సీలో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకున్నాడు.


ఇవీ చదవండి:

అప్పుడు గుండె ఆగినంత పనైంది

సిక్స్‌ కొట్టి కుప్పకూలి

సీఏసీ చైర్మన్‌గా ప్రజ్ఞాన్‌ ఓఝా

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 30 , 2025 | 09:06 AM