Share News

Ashwin On England Batting: ఇంత మోసమా? ఇంగ్లండ్‌‌పై అశ్విన్ సీరియస్! అసలు మ్యాటర్ ఇదే..

ABN , Publish Date - Jul 11 , 2025 | 01:35 PM

ఇంగ్లండ్ మోసం చేసిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఊహించని విధంగా షాక్ ఇచ్చిందన్నాడు.

Ashwin On England Batting: ఇంత మోసమా? ఇంగ్లండ్‌‌పై అశ్విన్ సీరియస్! అసలు మ్యాటర్ ఇదే..
India vs England

బజ్‌బాల్ ఫార్ములాతో టెస్టులను టీ20లుగా మార్చేసింది ఇంగ్లండ్. ఫలితం తప్పక రాబట్టాలనే ఉద్దేశంతో వేగంగా ఆడుతూ మూడ్నాలుగు రోజుల్లోనే మ్యాచుల్ని ముగిస్తోంది. చిన్న టీమ్సే కాదు.. బడా జట్లతో ఆడేటప్పుడూ ఇదే ఫార్ములాను అనుసరిస్తోంది స్టోక్స్ సేన. అయితే టీమిండియా ముందు ఆ జట్టు పప్పులు ఉడకడం లేదు. ఇంగ్లండ్ కంటే వేగంగా పరుగులు చేస్తూ, సెంచరీలు-డబుల్ సెంచరీలు బాదుతున్నారు టీమిండియా స్టార్లు. దీంతో ప్లాన్ మార్చిన ఇంగ్లీష్ టీమ్.. లార్డ్స్ టెస్ట్‌లో నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తోంది. దీనిపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఇంగ్లండ్ మోసం చేసిందంటూ అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


ప్లాన్ రివర్స్..

‘లార్డ్స్ టెస్ట్ తొలి రోజు ఇంగ్లండ్ చాలా బాగా ఆడింది. అందరూ ఆ టీమ్ బజ్‌బాల్ ఫార్ములాతో వేగంగా పరుగులు చేస్తుందని భావించారు. కానీ బజ్‌బాల్‌కు బదులు ప్రాంక్‌బాల్ ఆడుతూ వాళ్లు అందర్నీ మోసం చేశారు. సగటున ఓవర్‌కు 4 నుంచి 4.5 రన్ రేట్‌తో బ్యాటింగ్ చేసే ఇంగ్లండ్ ప్లాన్ మార్చేసింది. 3 పరుగులు చొప్పున బ్యాటింగ్ చేస్తూ షాక్‌కు గురిచేసింది. అయితే జో రూట్ ఆడిన తీరును మాత్రం మెచ్చుకోక తప్పదు. అతడు సరైన సమయానికి సరైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో ఎలా బ్యాటింగ్ చేయాలనే దానికి రూట్ ఇన్నింగ్స్ మంచి ఉదాహరణ’ అని అశ్విన్ తన యూట్యూబ్‌ చానల్‌లో చెప్పుకొచ్చాడు.

root.jpg


ఉపఖండ వికెట్‌లా..

లార్డ్స్ పిచ్ క్రమంగా ఉపఖండ వికెట్‌లా మారుతోందన్నాడు అశ్విన్. 60 ఓవర్ల తర్వాత బంతి సాఫ్ట్‌గా మారుతుందని.. కానీ జడేజా బౌలింగ్‌లో రూట్ ఎదుర్కొన్న బంతి అనుకున్న దాని కంటే మరీ తక్కువ ఎత్తులో వెళ్లిందన్నాడు. ఇంగ్లండ్ కండీషన్స్‌లో ఇది కొత్తగా అనిపిస్తోందన్నాడు అశ్విన్. బంతి కొన్నిసార్లు అనూహ్యంగా బౌన్స్ అవుతుండటం కూడా ఆందోళన కలిగిస్తోందన్నాడు. ఎక్కువగా బౌలింగ్ చేయని నితీష్ రెడ్డి 2 వికెట్లు తీయడం.. రూట్-స్టోక్స్‌ను ఇబ్బంది పెట్టడం చూస్తున్నామని.. రెండో రోజు ఆటలో ఏదైనా జరగొచ్చన్నాడు వెటరన్ స్పిన్నర్.


ఇవీ చదవండి:

కోహ్లీకి గంభీర్ కౌంటర్!

టీమిండియా కొంపముంచిన మిస్టేక్స్

రూట్‌ను ఆటాడుకున్న జడేజా!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 01:39 PM