Share News

Jacob Bethell: బామ్మ కోసం సిక్స్ బాదిన ఆర్సీబీ స్టార్.. ఈ వీడియో చూసి తీరాల్సిందే!

ABN , Publish Date - Jun 09 , 2025 | 10:12 AM

ఒక బామ్మ కోసం ఓ ఆర్సీబీ స్టార్ భారీ సిక్స్ బాదాడు. నిల్చున్న చోటు నుంచే బంతిని స్టాండ్స్‌లోకి తరలించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Jacob Bethell: బామ్మ కోసం సిక్స్ బాదిన ఆర్సీబీ స్టార్.. ఈ వీడియో చూసి తీరాల్సిందే!
Jacob Bethell

బిగ్ టీమ్స్ ఆడుతున్నాయంటే క్రికెట్ స్టేడియాల్లో అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమాన ఆటగాళ్ల పేర్లతో ఉండే జెర్సీలు వేసుకొని మైదానాల్లో ఫ్యాన్స్ తెగ హల్‌చల్ చేస్తుంటారు. కొందరైతే తమ ఫేవరెట్ ప్లేయర్లపై ఉన్న అభిమానాన్ని ప్లకార్డుల రూపంలో చాటుకుంటారు. పలు రకాల స్లోగన్స్‌తో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉండటం చూసే ఉంటారు. ఇంకొందరైతే సెంచరీ కొట్టాలి, ఫలానా రికార్డును బ్రేక్ చేయాలంటూ కోరికల్ని కూడా వాటిల్లో ప్రస్తావిస్తుంటారు. అయితే ఓ అభిమాని మాత్రం ‘మా బామ్మ కోసం సిక్స్ కొట్టు’ అంటూ వెరైటీ ప్లకార్డ్ ప్రదర్శించాడు. దీంతో వెంటనే బ్యాటర్ సిక్స్ కొట్టడం హైలైట్‌గా మారింది. ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టీ20 పోరులో ఇది చోటుచేసుకుంది. అసలు ఏమైందంటే..


ప్లకార్డ్ చూపించగానే..

రెండో టీ20లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయమది. జాకబ్ బేతెల్ (26) క్రీజులో ఉన్నాడు. పించ్ హిట్టర్ అయిన ఈ ఆర్సీబీ స్టార్ భారీ షాట్లతో విరుచుకుపడతాడని ఫ్యాన్స్‌కు తెలుసు. అందుకే బిగ్ షాట్లు కొట్టమంటూ అభిమానులు కోరారు. అదే టైమ్‌లో స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమాని తన దగ్గర ఉన్న ప్లకార్డ్‌ను ప్రదర్శించాడు. అందులో ‘మా బామ్మ కోసం సిక్స్ కొట్టు’ అని రాసి ఉంది.


బాదేశాడు..

ఆ ప్లకార్డ్‌ను కెమెరాలు అలా కవర్ చేశాయో లేదో తర్వాతి బంతికే పేసర్ అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో స్ట్రయిట్ బౌండరీ దిశగా భారీ సిక్స్ బాదాడు బేతెల్. దీంతో బామ్మ కోరికను బేతెల్ నిజం చేశాడని అంతా మెచ్చుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఈ టార్గెట్‌ను 18.3 ఓవర్లలో ఉఫ్‌మని ఊదిపారేసింది ఇంగ్లండ్. 4 ఓవర్లలో 25 పరుగులకు 2 వికెట్లు తీసిన ల్యూక్ వుడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది.


ఇవీ చదవండి:

ఆల్‌టైమ్ రికార్డ్.. 134 ఏళ్లలో..!

వైభవంగా రింకూ నిశ్చితార్థం

మరిన్నిక్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 09 , 2025 | 10:18 AM