CSK IPL 2025: సీఎస్‌కేలోకి డివిలియర్స్ వారసుడు.. బౌలర్లు తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:43 PM
Indian Premier League: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఓ చిచ్చరపిడుగు ఎంట్రీ ఇచ్చాడు. డివిలియర్స్ వారసుడిగా మన్ననలు పొందుతున్న ఆ పించ్ హిట్టర్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌లో పాపులర్ ఫ్రాంచైజీలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో అనుకున్నంతగా ఆడట్లేదు. అంచనాలను అందుకోవడం ఎల్లో ఆర్మీ తరచూ విఫలమవుతోంది. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటిదాకా ఆడిన 7 మ్యాచుల్లో 2 విజయాలు, 5 ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్ ప్లేస్‌లో ఉంది ధోని టీమ్. ఈ తరుణంలో ఆ జట్టును ఆదుకునేందుకు డివిలియర్స్ వారసుడు వచ్చేస్తున్నాడు. కొడితే బంతి స్టాండ్స్‌లో పడాల్సిందే అనే రేంజ్‌లో ఆడే ఆ చిచ్చరపిడుగు సీఎస్‌కే కష్టాలు తీర్చడం ఖాయమని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. మరి.. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
గట్టి ప్లానింగే..
సౌతాఫ్రికా యంగ్ సెన్సేషన్, పించ్ హిట్టర్ డెవాల్డ్ బ్రేవిస్ సీఎస్‌కే క్యాంప్‌లోకి అడుగుపెట్టాడు. గాయపడిన గుర్జన్‌ప్రీత్ సింగ్ స్థానంలో బ్రేవిస్‌ను టీమ్‌లోకి తీసుకుంది ఎల్లో ఆర్మీ. ఇప్పటికే రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో ఆయుష్ మాత్రేను రీప్లేస్ చేసిన చెన్నై.. ఇప్పుడు బ్రేవిస్‌ను కూడా టీమ్‌లోకి తీసుకోవడంతో గట్టి ప్లానింగే చేస్తున్నట్లు కనిపిస్తోంది. బేబీ డివిలియర్స్‌గా పేరు తెచ్చుకున్న డెవాల్డ్‌తో మాస్ హిట్టింగ్ చేయించాలని ధోని అండ్ కో వ్యూహాలు పన్నుతున్నారట. 360 డిగ్రీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకోవడంలో బ్రేవిస్ స్పెషలిస్ట్. అందుకే అతడ్ని ప్రధాన ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారట. కాగా, 21 ఏళ్ల బ్రేవిస్.. టీ20ల్లో 81 మ్యాచుల్లో 1787 రన్స్ చేశాడు. డివిలియర్స్ మాదిరిగా గ్రౌండ్ నలుమూలలా షాట్లు బాదడం.. స్కూప్స్, లాఫ్టెడ్ కవర్ డ్రైవ్స్, లాంగాన్ సిక్సులు కొట్టే సామర్థ్యం ఉండటంతో అతడు ఈ సీజన్‌లో డేంజర్ బ్యాటర్‌గా మారే అవకాశం ఉంది. ఈ యంగ్ బ్యాటర్ సేవల్ని సీఎస్‌కే ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.
ఇవీ చదవండి:
స్టార్ క్రికెటర్లు నాకు అశ్లీల ఫొటోలు పంపారు..
ఎస్‌ఆర్‌హెచ్‌కు ఒకే దారి.. ఇలా చేస్తే ప్లేఆఫ్స్‌కు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి