Virat Kohli IPL 2025: ఆర్సీబీ గెలిచినా కోహ్లీపై తప్పని ట్రోల్స్.. ఎవర్రా మీరంతా..
ABN , Publish Date - Apr 28 , 2025 | 03:33 PM
RCB: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో రిథమ్‌లోకి వచ్చిన కింగ్.. దాన్నే క్యాష్ రిచ్ లీగ్‌లో కంటిన్యూ చేస్తున్నాడు. టీమ్ విక్టరీల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయినా అతడిపై విమర్శలు ఆగడం లేదు. కారణం ఏంటంటే..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన సండే ఫైట్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది ఆర్సీబీ. దీంతో 14 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో ఫస్ట్ ప్లేస్‌కు ఎగబాకింది. ప్లేఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచిన చూసిన ఆర్సీబీని చూసి అంతా వణుకుతున్నారు. ముఖ్యంగా ఆరెంజ్ క్యాప్ విజేత, బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని చూసి మిగిలిన జట్లు భయపడుతున్నాయి. ఇప్పటికే 443 పరుగులు కొట్టిన కింగ్.. ఇతర మ్యాచుల్లో తమను చావబాడదడం ఖాయమని ప్రత్యర్థి టీమ్స్ షేక్ అవుతున్నాయి. అయితే బ్యాట్‌తో పాటు స్టన్నింగ్ ఫీల్డింగ్, అలాగే కెప్టెన్ రజత్ పాటిదార్‌కు అండగా ఉంటూ ఆర్సీబీని అంతా తానై నడిపిస్తున్న కోహ్లీ మీద విమర్శలు మాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
టార్గెట్ చేసి..
ఐపీఎల్-2025లో కోహ్లీ రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు 25 ప్లస్ పరుగులు చేసిన ప్రతిసారి ఆర్సీబీ నెగ్గుతూ వస్తోంది. దీన్ని బట్టే కింగ్ రాణించడం ఆ టీమ్‌కు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేసి ఇన్నింగ్స్‌ను లీడ్ చేశాడు. అయితే ఇంత చేసినా అతడి స్ట్రైక్ రేట్‌పై విమర్శలు వస్తున్నాయి. డీసీతో మ్యాచ్‌లో 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు విరాట్. ఇందులో 4 బౌండరీలు ఉన్నాయి. దీన్నే టార్గెట్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్. కోహ్లీ భారీ షాట్లు ఆడటం లేదని, అతడి స్ట్రైక్ రేట్ 108గా ఉందని.. అసలు ఇలాగేనా టీ20ల్లో ఆడేదంటూ ట్రోల్ చేస్తున్నారు.
స్ట్రైక్ రేట్‌తో పనేంటి..
కృనాల్ పాండ్యా గనుక చెలరేగకపోతే డీసీతో మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విరాట్ హిట్టింగ్ మర్చిపోయాడని.. ఇదేం స్ట్రైక్ రేట్ సామి అంటూ అతడ్ని టార్గెట్ చేస్తున్నారు. దీనిపై ఆర్సీబీ అభిమానులు, విరాట్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. చేజింగ్‌లో స్ట్రైక్ రేట్‌తో పనేంటి.. టీమ్ గెలిచిందా.. లేదా.. అనేదే ముఖ్యమని అంటున్నారు. ఇతర మ్యాచుల్లో కోహ్లీ ఎలా ఆడుతున్నాడో చూస్తున్నారా.. మ్యాచ్ సిచ్యువేషన్స్‌ను బట్టి గేమ్ అవేర్‌నెస్‌తో విరాట్ బ్యాటింగ్ చేస్తాడని చెబుతున్నారు. సగం టోర్నీకే 443 పరుగులు బాదాడు.. టీమిండియాతో పాటు ఆర్సీబీకి ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడు.. అతడికి ఎలా ఆడాలి.. స్ట్రైక్ రేట్ ఎలా ఉండాలో నేర్పిస్తారా.. అసలు మీకు బుద్ధుందా.. ఎవర్రా మీరంతా అంటూ విరుచుకుపడుతున్నారు ఫ్యాన్స్. కోహ్లీని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదని ధమ్కీ ఇస్తున్నారు. మీకు స్ట్రైక్ రేట్ కావాలి.. మాకు కప్పు కావాలి, అది కోహ్లీ అందిస్తాడంటూ ఇచ్చిపడేస్తున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి