Virat Kohli vs KL Rahul: ఈ పగ చల్లారదు.. బెంగళూరులో స్టార్ట్.. ఢిల్లీలో నెక్స్ట్ లెవల్‌కు..
ABN , Publish Date - Apr 27 , 2025 | 05:32 PM
DC vs RCB: ప్లేఆఫ్స్ రేసులో ముందంజలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇవాళ కీలక పోరు జరగనుంది. ఇందులో నెగ్గిన టీమ్ ప్లేఆఫ్స్ దిశగా మరో ముందడుగు వేస్తుంది. అయితే మ్యాచ్ కంటే కూడా ఇద్దరు ప్లేయర్ల రివేంజ్ గురించే ఇప్పుడంతా డిస్కస్ చేసుకుంటున్నారు.

సండే ఫైట్‌లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ పోరులో గెలిచిన టీమ్ ప్లేఆఫ్స్ బెర్త్‌ను దాదాపుగా కన్ఫర్మ్ చేసుకున్నట్లే. అందుకే ఎలాగైనా నెగ్గాలని రెండు టీమ్స్ పట్టుదలతో ఉన్నాయి. అయితే ఇప్పుడీ మ్యాచ్ కంటే కూడా ఇరు జట్ల విరాట్ కోహ్లీ వర్సెస్ కేఎల్ రాహుల్ ఫైట్ గురించే అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఇద్దరిలో ఎవరు ఇవాళ పైచేయి సాధిస్తారోనని చర్చించుకుంటున్నారు. అయితే అసలు ఈ రివేంజ్ ఎక్కడ షురూ అయింది.. అనేది ఇప్పుడు చూద్దాం..
అది మనసులో ఉంచుకొని..
టీమిండియా తరఫున కలసి ఆడే కోహ్లీ-రాహుల్ మంచి ఫ్రెండ్స్. అయితే ఐపీఎల్‌లో మాత్రం వీళ్ల మధ్య కనిపించని రైవల్రీ నడుస్తోంది. బెంగళూరు బాయ్ అయిన రాహుల్.. ఆర్సీబీ తరఫునే క్యాష్ రిచ్ లీగ్‌లో డెబ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌కు మారాడు. ఈసారి ఢిల్లీ తరఫున అదరగొడుతున్నాడు. అయితే కోహ్లీ సారథ్యంలో ఆర్సీబీకి ఆడిన రాహుల్‌ను రీటెయిన్ చేసుకోలేదు. ఇటీవల మెగా ఆక్షన్‌లోనూ తక్కువ ధరకే వచ్చే చాన్స్ ఉన్నా రాహుల్‌ను ఆర్సీబీ తీసుకోలేదు. దీంతో అటు ఫ్రాంచైజీపై, ఇటు కోహ్లీ మీద కోపంగా ఉన్నాడో ఏమో.. ఆర్సీబీతో బెంగళూరులో జరిగిన రీసెంట్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు రాహుల్.
కోహ్లీ ఏం చేస్తాడో..
సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్‌లో 53 బంతుల్లో 93 పరుగుల విన్నింగ్ నాక్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్ ముగిశాక కాంతార మూవీలో హీరో రిషబ్ శెట్టి మాదిరిగా.. ఇది నా అడ్డా అంటూ బ్యాట్‌తో గిరి గీసి వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో పలుమార్లు రాహుల్‌ను చూస్తూ కోహ్లీ సెలబ్రేట్ చేసుకోవడం.. ఆఖర్లో విరాట్ ముందే ఇది నా గడ్డ అంటూ కేఎల్ సంబురాలు చేసుకోవడం వైరల్‌గా మారింది. దీంతో ఇవాళ ఢిల్లీలో జరిగే మ్యాచ్‌లో విరాట్ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. తన హోమ్ గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్ కాబట్టి రాహుల్ సెలబ్రేషన్‌ను మైండ్‌లో పెట్టుకొని కోహ్లీ ఎలా రియాక్ట్ అవుతాడోనని అంతా ఎదురు చూస్తున్నారు. వీళ్ల మధ్య ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఐపీఎల్ రైవల్రీ.. ఢిల్లీలో నెక్స్ట్ లెవల్‌కు చేరడం ఖాయమని అంటున్నారు నెటిజన్స్. ఇది ఇప్పట్లో ఆగదని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
టాస్ నెగ్గిన లక్నో.. కానీ కష్టమే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి