Share News

CSK vs SRH Prediction: చెపాక్‌లో సీఎస్‌కే-సన్‌‌రైజర్స్ ఫైట్.. ఓడితే..

ABN , Publish Date - Apr 25 , 2025 | 05:16 PM

Sunrisers Hyderabad: ప్లేఆఫ్స్‌కు టైమ్ దగ్గర పడుతున్న తరుణంలో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది సన్‌‌రైజర్స్. తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ చెపాక్ వేదికగా సీఎస్‌కేతో జరిగే మ్యాచ్‌కు రెడీ అవుతోంది కమిన్స్ సేన.

CSK vs SRH Prediction: చెపాక్‌లో సీఎస్‌కే-సన్‌‌రైజర్స్ ఫైట్.. ఓడితే..
CSK vs SRH

గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఓడలు బండ్లు అయినట్లు.. తోపు టీమ్‌గా ఐపీఎల్-2025ను స్టార్ట్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్.. సగం టోర్నమెంట్ పూర్తయ్యేసరికి వరుస ఓటములతో డీలాపడింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది కమిన్స్ సేన. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లో భారీ తేడాతో నెగ్గితే తప్ప ప్లేఆఫ్స్ ద్వారాలు మూసుకుపోవడం ఖాయం. అందుకే పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్ ప్లేస్ కోసం తమతో పోటీపడుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్‌లో ఇవాళ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైపోయింది ఆరెంజ్ ఆర్మీ. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..


బలాలు

సీఎస్‌కే: ఈ జట్టుకు బ్యాటింగే బలం. దాదాపుగా బ్యాటర్లందరికీ చెపాక్ పిచ్ కొట్టిన పిండే. జడేజా, దూబె మంచి ఫామ్‌లో ఉన్నారు. కొత్త కుర్రాళ్లు షేక్ రషీద్, ఆయుష్ మాత్రే వేగంగా పరుగులు చేస్తుండటం బిగ్ ప్లస్. బౌలింగ్‌లో జడేజాతో పాటు పతిరానా, అన్షుల్ కాంబోజ్ రాణిస్తుండటం కలిసొచ్చే అంశం.

ఎస్‌ఆర్‌హెచ్: విధ్వంసక బ్యాటర్ క్లాసెన్ ఫామ్‌లోకి రావడం బిగ్ ప్లస్. అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ లాంటి యంగ్ బ్యాటర్లు కూడా టచ్‌లో కనిపిస్తున్నారు. అభిషేక్ వర్మ సెంచరీ తర్వాత పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడకపోయినా మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు. బౌలింగ్‌లో కెప్టెన్ కమిన్స్, ఎషాన్ మలింగ, ఉనద్కట్ రాణిస్తున్నారు.


బలహీనతలు

సీఎస్‌కే: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ బ్యాటింగ్ ఫెయిల్యూర్‌ చెన్నైని తీవ్రంగా నిరాశపరుస్తోంది. హోమ్ మ్యాచెస్ కోసం టీమ్‌ను బిల్డ్ చేస్తుంటే అక్కడే వాళ్లంతా దారుణంగా విఫలమవుతున్నారు. అందుకే వరుస ఓటములతో చెపాక్‌ కోట క్రమంగా కూలుతోంది. బౌలింగ్‌లో ఓవర్టన్, నూర్ అహ్మద్ వికెట్లు తీయలేకపోతున్నారు. పతిరానా బ్రేక్‌త్రూలు ఇస్తున్నా ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం బిగ్ మైనస్.

ఎస్‌ఆర్‌హెచ్: ట్రావిస్ హెడ్ బ్యాట్ నుంచి బిగ్ నాక్స్ రావడం లేదు. సీజన్ ఆరంభంలో సెంచరీ బాదిన తర్వాత ఇషాన్ కిషన్ నుంచి ఒక్క పెద్ద ఇన్నింగ్స్ కూడా రాలేదు. వీళ్లిద్దరితో పాటు తెలుగు తేజం నితీష్ రెడ్డి ఫెయిల్యూర్ టీమ్‌కు బిగ్ మైనస్‌గా మారింది. బౌలింగ్‌లో కన్‌సిస్టెన్సీ లోపిస్తోంది. కమిన్స్ సహా మిగతా బౌలర్లు ఒక్కో మ్యాచ్‌లో ఒక్కోలా బౌలింగ్ చేస్తున్నారు. అడపాదడపా తప్పితే అవసరమైన టైమ్‌లో బంతి చేతికిస్తే వికెట్లు తీసేవారు కనిపించడం లేదు.


గత రికార్డులు

ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా 21 మ్యాచులు జరిగాయి. ఇందులో 15 మ్యాచుల్లో సీఎస్‌కే, ఆరింట సన్‌రైజర్స్ విజయం సాధించాయి.

విన్నింగ్ ప్రిడిక్షన్

సీఎస్‌కే కంటే సన్‌రైజర్స్ బ్యాటింగ్ పరంగా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కానీ గత రికార్డులు, లోకల్ కండీషన్స్‌, హోమ్ ఫ్యాన్స్ సపోర్ట్, బ్యాటింగ్-బౌలింగ్‌లో బెటర్ బ్యాలెన్స్ కలిగి ఉండటం వల్ల ఈ పోరులో కమిన్స్ సేన మీద ధోని టీమ్ విక్టరీ కొట్టడం ఖాయం.


ఇవీ చదవండి:

రిటైర్మెంట్‌పై రోహిత్-కోహ్లీ వెనక్కి..

ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు..

ఐసీసీ టోర్నీల్లో ఇండో-పాక్ ఫైట్ కష్టమే

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 25 , 2025 | 05:22 PM