CSK vs SRH Playing 11: చెపాక్ చాలెంజ్.. ఈ ప్లేయింగ్ 11తో చెన్నై కోట కూలుస్తారా..
ABN , Publish Date - Apr 25 , 2025 | 06:00 PM
Today IPL Match: చెపాక్ చాలెంజ్‌కు రెడీ అవుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన సిచ్యువేషన్‌లో సీఎస్‌కేను ఓడించి ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపాలని అనుకుంటోంది కమిన్స్ సేన.

ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయిపోయిందేదో అయిపోయింది కొత్త సీజన్‌ను ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలని భావిస్తోంది కమిన్స్ సేన. అందుకు చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌ను వాడుకోవాలని చూస్తోంది. చెపాక్ వేదికగా ఇవాళ సీఎస్‌కేతో జరిగే మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించాలని అనుకుంటోంది. అందుకోసం సాలిడ్ ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మరి.. ఆరెంజ్ ఆర్మీ ప్లేయింగ్ 11 ఎలా ఉండే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం..
చేంజెస్ ఇవే..
వరుస ఓటములు ఎదురవుతున్నా సరే.. దూడుకు మంత్రాన్నే జపిస్తోంది సన్‌రైజర్స్. అనుకున్న రిజల్ట్ రాకపోయినా తాము బ్యాంగ్ బ్యాంగ్ అప్రోచ్‌తోనే ఆడతామని ఎస్ఆర్‌హెచ్ స్టార్ బ్యాటర్ క్లాసెన్ స్పష్టం చేశాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే.. ఒకట్రెండు మార్పులు తప్పితే దాదాపుగా లాస్ట్ మ్యాచ్‌లో ఆడిన జట్టునే సన్‌రైజర్స్ కంటిన్యూ చేసే చాన్సులు కనిపిస్తున్నాయి. చెపాక్ వికెట్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. కాబట్టి స్పిన్నర్ రాహుల్ చాహర్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఖాయంగా కనిపిస్తోంది. మహ్మద్ షమి ఈ మ్యాచ్‌లోనూ బెంచ్‌కే పరిమితం కావొచ్చు. స్లో పిచ్ కాబట్టి పేసర్ ఉనాద్కట్ తుదిజట్టులో ఉండటం పక్కా. పూర్తి ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇప్పుడు చూద్దాం..
సన్‌రైజర్స్ (అంచనా): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, రాహుల్ చాహర్, ఎషాన్ మలింగ.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: జీషాన్ అన్సారీ.
చెన్నై సూపర్ కింగ్స్ (అంచనా): షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుష్ మాత్రే, రవీంద్ర జడేజా, శివం దూబే, విజయ్ శంకర్, జేమీ ఓవర్టన్, ఎంఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీష పతిరానా.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: రవిచంద్రన్ అశ్విన్.
ఇవీ చదవండి:
రిటైర్మెంట్‌పై రోహిత్-కోహ్లీ వెనక్కి..
ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి