CSK vs SRH Toss: చెపాక్ ఫైట్.. టాస్ నెగ్గిన సన్‌రైజర్స్.. కానీ..
ABN , Publish Date - Apr 25 , 2025 | 07:08 PM
Today IPL Match: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచింది. సీఎస్‌కేతో చెపాక్ వేదికగా జరుగుతున్న పోరులో పాట్ కమిన్స్ టాస్ గెలిచాడు. అతడు ఏం ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

చెన్నై సూపర్ కింగ్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మొదలైపోయింది. కీలక ఫైట్‌లో టాస్ నెగ్గిన ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ పాట్ కమిన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆతిథ్య జట్టు ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేయనుంది. స్లో వికెట్ కాబట్టి చేజింగ్ ఈజీ అవుతుందనే ఉద్దేశంతో కమిన్స్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో 3 కీలక మార్పులు చేసింది సీఎస్‌కే. రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్, జేమీ ఓవర్టన్‌ను టీమ్ నుంచి తప్పించింది. వీళ్ల స్థానాల్లో డెవాల్డ్ బ్రేవిస్, శామ్ కర్రన్, దీపక్ హుడాకు చోటు కల్పించింది. అటు సన్‌రైజర్స్ ట్రావిస్ హెడ్ స్థానంలో కుశాల్ మెండిస్‌ను తీసుకుంది. అలాగే సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి కూడా తుదిజట్టులో చోటు కల్పించింది.
ఇవీ చదవండి:
ఈ ప్లేయింగ్ 11తో చెన్నై కోట కూలుస్తారా..
రిటైర్మెంట్‌పై రోహిత్-కోహ్లీ వెనక్కి..
ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి