CSK vs KKR Toss: సీఎస్‌కే వర్సెస్ కేకేఆర్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..
ABN , Publish Date - Apr 11 , 2025 | 07:07 PM
Indian Premier League: చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. టాస్ నెగ్గిన కేకేఆర్ కెప్టెన్ రహానె ఏం ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్ లవర్స్‌లో ఎంతో ఆసక్తి రేపిన చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయంతో దూరమవడంతో అతడి స్థానంలో సారథ్య పగ్గాలు చేపట్టిన ఎంఎస్ ధోని టాస్ ఓడిపోయాడు. టాస్ నెగ్గిన కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానె తొలుత బౌలింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. దీంతో ఎల్లో ఆర్మీ మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.
రెండు జట్లలోనూ మార్పులు
సీఎస్‌కే తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేసింది. గత మ్యాచ్‌లో ఆడిన ముఖేశ్ చౌదరి స్థానంలో ఈసారి అన్షుల్ కాంబోజ్‌కు చాన్స్ ఇచ్చింది. అలాగే గాయంతో టోర్నీ మొత్తానికి దూరమైన రుతురాజ్ ప్లేస్‌లో రాహుల్ త్రిపాఠీని తీసుకుంది. అటు కేకేఆర్ ఒక చేంజ్ చేసింది. గత మ్యాచ్‌లో ఆడిన స్పెన్సన్ జాన్సన్ స్థానంలో ఈసారి మొయిన్ అలీని రీప్లేస్ చేసింది. మిగతా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.
ప్లేయింగ్ 11 ఇదే..
సీఎస్‌కే: రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్ & వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్.
కేకేఆర్: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
ఇవీ చదవండి:
క్రికెట్‌లో కొత్త రూల్.. బ్యాటర్లకే వణుకే
ప్లేయింగ్ 11తో అల్లాడిస్తున్నారు
తొడ కొట్టేదెవరు.. తడబడేదెవరు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి