Share News

CSK vs GT Target: చెన్నై బిగ్ టార్గెట్.. జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

ABN , Publish Date - May 25 , 2025 | 05:52 PM

చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్‌ బౌలర్లతో ఆటాడుకున్నారు సీఎస్‌కే బ్యాటర్లు. ఏకంగా 200కి పైగా స్కోరు బాదేశారు.

CSK vs GT Target: చెన్నై బిగ్ టార్గెట్.. జీటీ ఇక సర్దుకోవాల్సిందే!
CSK vs GT

ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎప్పుడో తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను వణికిస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే.. 20 ఓవర్లలో ఏకంగా 230 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఆయుష్ మాత్రే (17 బంతుల్లో 34), డెవాన్ కాన్వే (35 బంతుల్లో 52) సూపర్ స్టార్ట్ ఇచ్చారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37), శివం దూబె (8 బంతుల్లో 17) కూడా దంచికొట్టారు. ఆఖర్లో డెవాల్డ్ బ్రేవిస్ (23 బంతుల్లో 57) విధ్వంసక బ్యాటింగ్‌తో గుజరాత్‌కు చుక్కలు చూపించాడు.


కొండంత లక్ష్యం!

సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో బ్రేవిస్ బ్యాటింగ్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. 247 స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన ఈ పించ్ హిట్టర్.. 4 బౌండరీలు, 5 సిక్సులు బాదాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు బేబీ డివిలియర్స్. గ్రౌండ్‌కు నలుమూలలా షాట్లు కొడుతూ జీటీ బౌలర్లకు దిక్కుతోచకుండా చేశాడు. ఎటు వైపు బంతులు వేసినా బౌండరీ లైన్ దాటుతుండటంతో ప్రత్యర్థి జట్టుకు ఏం చేయాలో పాలుపోలేదు. చివర్లో రవీంద్ర జడేజా (18 బంతుల్లో 21) కూడా భారీ షాట్లు ఆడటంతో ఏకంగా 230 పరుగుల భారీ లక్ష్యాన్ని సెట్ చేసింది సీఎస్‌కే. పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తున్నా కొండంత టార్గెట్‌ను చేజ్ చేయడం అంత సులువేమీ కాదు. వికెట్లు పడితే జీటీ ఒత్తిడిలో పడటం ఖాయం.


ఇవీ చదవండి:

ఒకే మ్యాచ్‌లో 9 వికెట్లు

ఒకే ఓవర్‌లో 28 రన్స్..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 25 , 2025 | 05:52 PM