MS Dhoni-CSK CEO: డ్రెస్సింగ్ రూమ్‌కు ధోని.. ఆపిన సీఎస్కే ఓనర్.. హింట్ ఇచ్చేశారా..
ABN , Publish Date - May 01 , 2025 | 02:17 PM
CSK vs PBKS: ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది సీఎస్కే. 10 మ్యాచుల్లో ఎనిమిదింట్లో ఓడిన ధోని సేన.. ఇంకో 4 మ్యాచులు ఉండగానే ఇంటిదారి పట్టింది. నెక్స్ట్ ఆడే మ్యాచులు ఆ టీమ్‌కు నామమాత్రం కానున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ఎక్కడో మిణుకుమిణుకుమని అంటున్న ఆశలు కూడా ఆవిరయ్యాయి. ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది సీఎస్కే. సొంతగడ్డ చెపాక్ వేదికగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో మట్టికరిచింది ధోని సేన. ఈ ఓటమితో ఆ టీమ్ ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా అడుగంటాయి. ఇక మీదట ఆడే 4 మ్యాచులు ఆ టీమ్‌కు నామమాత్రం కానున్నాయి. ఒకవైపు సీఎస్కే ఓటమితో ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోగా.. మరోవైపు కెప్టెన్ ధోని రిటైర్మెంట్పై ఒక్కొక్కటిగా హింట్స్ ఇవ్వడం వాళ్లను మరింత టెన్షన్ పెడుతోంది. పంజాబ్‌తో మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న మాహీని టీమ్ ఓనర్ ఆపడం ఆసక్తికరంగా మారింది.
చప్పట్లతో..
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రెండుసార్లు ధోని రిటైర్మెంట్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చినట్లయింది. తొలుత టాస్ దగ్గర వచ్చే ఏడాది మళ్లీ చెపాక్‌కు వస్తావు కదా అంటూ వ్యాఖ్యాత మాహీని ప్రశ్నించాడు. దీనికి అతడు.. నెక్స్ట్ మ్యాచ్ ఆడతానో.. లేదో.. తెలియదు. ఇక తర్వాతి సీజన్ గురించి ఏం చెప్పగలను అన్నాడు. అయితే ధోని నవ్వుతూ మాట్లాడటంతో సరదాగానే ఇలా అని ఉండొచ్చని అంతా అనుకున్నారు. అయితే మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న ధోనీని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ ఆపారు. ఇద్దరి మధ్య చాలా సేపు డిస్కషన్స్ నడిచాయి. మొదట చప్పట్లతో మాహీని మెచ్చుకున్న టీమ్ ఓనర్.. అనంతరం అతడితో దీర్ఘంగా చర్చిస్తూ కనిపించారు.
ఎందుకు ఆపినట్లు..
లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా తన టీమ్ ఓటమిని తట్టుకోలేరు. ఆ బాధతో లాస్ట్ సీజన్లో కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్‌ను గ్రౌండ్‌లోనే చీవాట్లు పెట్టారు. ఈసారి నయా సారథి రిషబ్ పంత్‌కు కూడా క్లాసులు పీకుతూ వస్తున్నారు. దీంతో నిన్న ధోనీని కాశీ విశ్వనాథ్ ఆపగానే.. ఇలాంటిదేదో చేస్తారని అంతా అనుకున్నారు. కానీ సీఎస్కే ఓనర్ నవ్వుతూ కూల్‌గా మాట్లాడారు. అయితే వాళ్ల మధ్య ఎక్కువసేపు చర్చ జరగడంతో రిటైర్మెంట్ గురించి ఏమైనా హింట్ ఇస్తున్నారా.. అనే చర్చలు ఊపందుకున్నాయి. ఓనర్ తలచుకుంటే ధోనీతో ఎప్పుడైనా మాట్లాడొచ్చని.. కానీ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్నప్పుడు ఆపడం ఏంటని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టాస్ టైమ్‌లో ధోని వ్యాఖ్యలు, ఇలా ఓనర్ ఆపి మరీ మాట్లాడటం.. అంతా చూస్తుంటే ఏదో తేడా కొడుతుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి