Ben Stokes Subcontinent Pitch: ఆడలేక మద్దెల దరువు.. పరువు తీసుకుంటున్న ఇంగ్లండ్!
ABN , Publish Date - Jul 09 , 2025 | 11:01 AM
టీమిండియా కొట్టిన దెబ్బకు ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్‌కు మైండ్ బ్లాంక్ అయింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో గిల్ సేన ఇచ్చిన ట్రీట్‌మెంట్ నుంచి ప్రత్యర్థి జట్టు సారథి ఇంకా కోలుకోవడం లేదు.

టీమిండియాను చూసి భయపడుతోంది ఇంగ్లండ్. లీడ్స్ టెస్ట్‌లో బ్యాటింగ్ బలంతో బయటపడిన ఆతిథ్య జట్టు.. ఎడ్జ్‌బాస్టన్‌లో మాత్రం గిల్ సేన ముందు సరెండర్ అయింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో తిరుగులేని ఆధిపత్యం చూపించిన మెన్ ఇన్ బ్లూ.. ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో స్టోక్స్ సేనను చిత్తు చేసింది. సొంతగడ్డపై ఊహించని పరాభవంతో ఇంగ్లండ్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆ టీమ్ కెప్టెన్ స్టోక్స్ ఓటమి నెపాన్ని పిచ్ క్యూరేటర్‌పై నెట్టేస్తున్నాడు. ఇది ఉపఖండంలో మాదిరిగా ఫ్లాట్ పిచ్‌లా మారిందని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అతడికి భారత కోచ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
ఎస్కేపిజం అవసరమా?
స్టోక్స్ చెప్పినట్లు ఎడ్జ్‌బాస్టన్ వికెట్ పూర్తి బ్యాటింగ్ ట్రాక్‌గా మారిందని అనుకుంటే.. భాతర బ్యాటర్లు అదరగొట్టిన చోట, ఇంగ్లండ్ ఎందుకు ఫెయిలైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో ఫ్లాట్ వికెట్‌పై భారత బౌలర్ల రేంజ్‌లో ఆతిథ్య జట్టు ఎందుకు బౌలింగ్ చేయలేకపోయిందనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఆడలేక మద్దెల దరువు అంటే ఇదేనని.. ఓటమి ఒప్పుకొనే ధైర్యం లేకే స్టోక్స్ ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంషు కోటక్ ఘాటుగా స్పందించాడు. ఇది ఉపఖండ పిచ్‌లా అనిపించలేదని, టీమిండియా బౌలర్లకు పిచ్ నుంచి బాగా మద్దతు లభించిందన్నాడు కోటక్.
టర్న్ దొరకడంతో..
ఎడ్జ్‌బాస్టన్ వికెట్ నుంచి భారత బౌలర్లకు మంచి మూవ్‌మెంట్ దొరికిందన్నాడు బ్యాటింగ్ కోచ్ సితాంషు కోటక్. ఫుట్‌మార్క్స్‌ను వాడుకొని తమ స్పిన్నర్లు వికెట్లు పడగొట్టారన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్ల తర్వాత జడేజా, సుందర్‌కు మంచి సపోర్ట్ దొరికిందన్నాడు సితాంషు కోటక్. బంతి తిరగడం మొదలవడంతో వాళ్లిద్దరూ మరింత ప్రభావవంతంగా బౌలింగ్ చేశారన్నాడు బ్యాటింగ్ కోచ్.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి