CSK vs GT: ఒకే ఓవర్‌లో 28 రన్స్.. సీఎస్‌కే ఓపెనర్ పిచ్చకొట్టుడు!
ABN , Publish Date - May 25 , 2025 | 04:18 PM
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఆయుష్ మాత్రే చెలరేగిపోయాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు విధ్వంసం సృష్టించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్ ఆయుష్ మాత్రే రెచ్చిపోయాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయుష్ చెలరేగిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీ లైన్ దాటించాడు. ముఖ్యంగా పేసర్ అర్షద్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకొని భారీ షాట్లు బాదాడు. అతడి ఓవర్‌లో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు ఆయుష్. అర్షద్ ఓవర్‌లో 3 సిక్సులు, 2 బౌండరీలు కొట్టాడు. మొత్తంగా 17 బంతుల్లో 34 పరుగులు చేశాడు మాత్రే. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. 200 స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ.. క్రీజులో ఉన్నంత సేపు జీటీని ఓ ఆటాడుకున్నాడు.
దంచుడే దంచుడు
ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఆయుష్ మాత్రే ఎట్టకేలకు ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మహ్మద్ సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఉర్విల్ పటేల్ కూడా దంచుడే దంచుడు అన్నట్లు ఆడుతున్నాడు. మరో ఓపెనర్ డెవిన్ కాన్వే (13 బంతుల్లో 18 నాటౌట్)తో కలసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు ఉర్విల్ (12 బంతుల్లో 20 నాటౌట్). గెలిచినా ఓడినా పోయేదేం లేదు కాబట్టి ఎలాంటి బెరుకు లేకుండా దంచుడే దంచుడు అన్నట్లు బ్యాటింగ్ చేస్తున్నారు సీఎస్‌కే బ్యాటర్లు. ప్రస్తుతానికి ఆ జట్టు 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 82 పరుగులతో ఉంది. ఆఖరి వరకు ఇదే జోరును కొనసాగిస్తే స్కోరు అలవోకగా 200 పరుగులు దాటుతుంది.
ఇవీ చదవండి:
హనుమయ్య సేవలో కోహ్లీ.. ఏం కోరుకున్నాడంటే!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి