AUS vs SA: టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీస్‌పై సస్పెన్స్ కంటిన్యూ
ABN , Publish Date - Feb 25 , 2025 | 06:33 PM
Champions Trophy 2025: ఎంతో ఆసక్తి రేపిన ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ రద్దయింది. ఈ మ్యాచ్‌లో బంతి కాదు కదా.. కనీసం టాస్ కూడా పడలేదు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా.. ప్రస్తుత క్రికెట్‌లో రెండు బడా జట్లు. చిరకాల ప్రత్యర్థులు కాకపోయినా ఈ టీమ్స్ బరిలోకి దిగిన ప్రతిసారి కొదమసింహాల్లా కొట్టుకుంటాయి. క్వాలిటీ క్రికెట్‌తో ఆడియెన్స్‌ను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. అందుకే ఆసీస్-ప్రొటీస్ ఫైట్ కోసం అందరూ ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తుంటారు. చాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అనగానే హ్యూజ్ బజ్ నెలకొంది. మ్యాచ్ చూసి ఎంజాయ్ చేద్దామని ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. కానీ ఏం లాభం? టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
వదలని వరుణుడు
ఆస్త్రేలియా-సౌతాఫ్రికా మధ్య ఇవాళ జరగాల్సిన గ్రూప్ బీ మ్యాచ్ రద్దయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు అనౌన్స్ చేశారు. ఒక్క బంతి కాదు కదా.. కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దవడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు. మ్యాచ్ రద్దుతో రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. మొదట వాన తగ్గేలా కనిపించడంతో 20 ఓవర్ల చొప్పున ఆడించే చాన్స్ ఉందని వినిపించింది. కానీ చివరకు మ్యాచ్‌ను రద్దు చేశారు.
ఇవీ చదవండి:
భార్య గురించి షాకింగ్ విషయం చెప్పిన చాహల్..
భారత్ విజయంపై పాక్ వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..
టీమిండియాకు ఇంత మేలు చేస్తారా? ఐసీసీపై క్రికెటర్ల ఆగ్రహం..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి