Share News

Cricket: స్టార్ క్రికెటర్‌తో సెల్ఫీ కోసం పరిగెత్తాడు.. తీరా వచ్చి చూస్తే..

ABN , Publish Date - Jan 16 , 2025 | 02:48 PM

Sam Konstas: సెలెబ్రిటీస్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడటం సర్వసాధారణమే. అయితే ఇలా ఫొటోలు దిగే క్రమంలో ఒక్కోసారి అనూమ్య ఘటనలు చోటుచేసుకుంటాయి.

Cricket: స్టార్ క్రికెటర్‌తో సెల్ఫీ కోసం పరిగెత్తాడు.. తీరా వచ్చి చూస్తే..
Sam Konstas

సెలెబ్రిటీస్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడటం సర్వసాధారణమే. అయితే ఇలా ఫొటోలు దిగే క్రమంలో ఒక్కోసారి అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటాయి. అలాంటి ఒక ఘటనే ఇది. ఓ స్టార్ క్రికెటర్‌తో సెల్ఫీ దిగాలని అనుకున్నాడో అభిమాని. అందుకోసం కారులో వెళ్తున్నోడు కూడా బండిని ఆపి పార్కింగ్‌లో పెట్టాడు. అయితే సెల్ఫీ కోసం కారు దిగి అలా వెళ్లాడో లేదో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. పాపం ఈ కష్టం పగోడికీ రాకూడదని అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఏ స్టార్ ప్లేయర్‌తో సెల్ఫీ కోసం వెళ్తున్న టైమ్‌లో ఇది చోటుచేసుకుంది? అనేది ఇప్పుడు చూద్దాం..


సెల్ఫీ హడావుడిలో..

ఆస్ట్రేలియా యంగ్ ఓపెనర్ సామ్ కోన్స్టాస్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి అతడేమీ చేయలేదు. అతడి తప్పే లేదు. కానీ కోన్స్టాస్‌తో సెల్ఫీ కోసం ఓ అభిమాని చేసిన పొరపాటు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ప్రాక్టీస్ కోసం తన లగేజీని పట్టుకొని గ్రౌండ్‌కు వెళ్తున్నాడు కోన్స్టాస్. అదే సమయంలో వెనుక నుంచి కారులో వెళ్తున్న ఒక క్రికెట్ లవర్ వెంటనే బండిని పార్క్ చేసి.. కంగారూ బ్యాటర్ ఆటోగ్రాఫ్, సెల్ఫీ కోసం పరిగెత్తాడు. అయితే అతడు ఈ హడావుడిలో కారు హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయాడు. ఆ ప్రదేశం కాస్తా ఏటవాలుగా ఉండటంతో కారు పార్కింగ్ నుంచి ముందుకు కదిలింది. దీంతో తప్పును గ్రహించిన వ్యక్తి మళ్లీ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు.


ఎంత ప్రయత్నించినా..!

ఆ అభిమాని తన కారును కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. అప్పటికే ముందు పార్క్ చేసిన కారును వెళ్లి అతడి బండి ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయలేమీ కాలేదు. చిన్నగా తాకడంతో సేఫ్ అయిపోయారు.. బలంగా ఢీకొట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అయితే అటు కోన్స్టాస్‌తో సెల్ఫీ మిస్ అవడం, ఇటు కారు వెళ్లి ఇంకో బండిని ఢీకొట్టడంతో ఆ అభిమానికి ఏమీ పాలుపోలేదు. యంగ్ బ్యాటర్‌ను ఆ ఫ్యాన్ కలిశాడో లేదో సమాచారం లేదు. కాగా, భారత్‌తో సిరీస్‌లో అటు బ్యాటింగ్‌లో అదరగొట్టడమే గాక ఇటు గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రాతో గొడవ కారణంగా కోన్స్టాస్ ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు.


ఇవీ చదవండి:

రోహిత్-కోహ్లీపై బ్యాన్.. స్టార్లకు ఉచ్చు బిగిస్తున్న బీసీసీఐ

టీమిండియాలో వణుకు.. డేంజర్ రూల్‌ను మళ్లీ తీసుకొస్తున్న బీసీసీఐ

లగ్జరీ బంగ్లా కొన్న కోహ్లీ-అనుష్క.. కొత్త ఇంటికి అన్ని కోట్లా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 16 , 2025 | 03:24 PM