Australia: చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం
ABN , Publish Date - Jan 31 , 2025 | 02:57 PM
Australia: ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆ టీమ్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ ఇది. దీని నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.

ఐసీసీ టోర్నమెంట్స్ వస్తున్నాయంటే అందరి కళ్లు ఆస్ట్రేలియా జట్టు మీదే ఉంటాయి. ఎందుకంటే ఆ జట్టు మేజర్ ఐసీసీ టైటిల్స్ ఎగరేసుకుపోయింది. కనీసం ఫైనల్ లేదా సెమీస్ చేరుకోవడం కంగారూలకు ఆనవాయితీగా వస్తోంది. ఒక కప్పు మిస్ అయినా మరో ట్రోఫీ గెలుచుకోవడం వాళ్లకు అలవాటు. ఇప్పుడు కూడా మరో కప్పు మీద కన్నేశారు కంగారూలు. పాకిస్థాన్, యూఏఈ వేదికగా వన్డే ఫార్మాట్‌లో త్వరలో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవాలని కమిన్స్ సేన భావిస్తోంది. అందుకు తగ్గట్లే ప్రిపరేషన్స్ కూడా మొదలుపెట్టింది. కానీ ఆ జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఆల్‌రౌండర్ దూరం!
ఆస్ట్రేలియా పేస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న మార్ష్ ఇంకా కోలుకోలేదని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. మెగా టోర్నీకి అతడు దూరంగా ఉంటాడని పేర్కొంది. ‘ఐసీసీ మెన్స్ చాంపియన్స్ ట్రోఫీకి మిచెల్ మార్ష్ దూరమయ్యాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న అతడు ఇంకా రికవర్ అవ్వలేదు. కొన్నాళ్లు రీహాబిలిటేషన్‌లో ఉన్నా ఇంకా కోలుకోలేదు. అందుకే నేషనల్ సెలెక్షన్ ప్యానెల్, ఆస్ట్రేలియా మెన్స్ మెడికల్ టీమ్ అతడ్ని మెగా టోర్నీకి దూరంగా ఉంచాలని నిర్ణయించాయి’ అని క్రికెట్ ఆస్ట్రేలియా తాజా ప్రకటనలో స్పష్టం చేసింది.
రీప్లేస్‌మెంట్ ఎవరు?
మార్ష్ మరికొన్నాళ్లు రీహాబిలిటేషన్‌లో ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ట్రీట్‌మెంట్ తర్వాత అతడు రెస్ట్ తీసుకుంటాడని చెప్పుకొచ్చింది. పూర్తిగా కోలుకున్నాక ప్రాక్టీస్ మొదలుపెడతాడని క్లారిటీ ఇచ్చింది. గాయంతో దూరమైన మార్ష్ స్థానంలో ఎవర్ని రీప్లేస్ చేస్తారనేది ఫిబ్రవరి 12వ తేదీ లోపు ఐసీసీకి క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పాల్సి ఉంటుంది. కాగా, ఇప్పటికే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చీలమండ గాయంతో బాధపడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అతడు ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ తరుణంలో టీమ్‌లో కీలక ఆటగాడైన మార్ష్ గాయపడటం, టోర్నీకి దూరమవడం కంగారూలకు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. ఒకవేళ చాంపియన్స్ ట్రోఫీ ఆరంభమయ్యే సమయానికి కమిన్స్ రికవర్ కాకపోతే సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సారథ్య పగ్గాలు తీసుకునే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
కోహ్లీని ఔట్ చేసిన టికెట్ కలెక్టర్.. ఎవరీ హిమాన్షు సాంగ్వాన్
గిరిపడిన ఆఫ్ స్టంప్.. కోహ్లీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి
‘అమ్మాయిల ఫుట్‌బాల్.. సంప్రదాయాలకు వ్యతిరేకం’
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి