Share News

Arshdeep Singh: సారీ చెప్పిన అర్ష్‌దీప్.. మ్యాటర్ ఏంటో తెలిస్తే నవ్వాగదు

ABN , Publish Date - Jan 23 , 2025 | 06:04 PM

Team India: టీమిండియా ఏస్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ క్షమాపణలు చెప్పాడు. అతడు ఎందుకు సారీ చెప్పాడు? ఎవరికి క్షమాపణలు చెప్పాడు? అనేది ఇప్పుడు చూద్దాం..

Arshdeep Singh: సారీ చెప్పిన అర్ష్‌దీప్.. మ్యాటర్ ఏంటో తెలిస్తే నవ్వాగదు
Team India

టీమిండియా యంగ్ సెన్సేషన్ అర్ష్‌దీప్ సింగ్ వీర ఫామ్‌లో ఉన్నాడు. మ్యాచ్ మ్యాచ్‌కు మరింత ఇంప్రూవ్ అవుతున్న ఈ స్పీడ్‌స్టర్.. సీనియర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి దారిలో నడుస్తున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నాడీ సర్దార్జీ. వైట్‌బాల్ క్రికెట్‌లో భారత్ నిలకడగా విజయాలు సాధించడంలో అర్ష్‌దీప్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. లెఫ్టార్మ్ పేస్‌తో అపోజిషన్ టీమ్స్‌ను చావుదెబ్బ తీస్తూ టీమిండియాకు ప్రధాన అస్త్రంగా మారాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లోనూ ఓపెనర్లను ఔట్ చేసి.. భారత్‌కు అదిరిపోయే బ్రేక్ ఇచ్చాడు. కెరీర్‌లో రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న అర్ష్‌దీప్ ఒక విషయంలో క్షమాపణలు చెప్పాడు. ఎందుకో ఇప్పుడు చూద్దాం..


దాటేశాడు!

సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు క్షమాపణలు చెప్పాడు అర్ష్‌దీప్. అతడు సారీ చెప్పడం వెనుక ఓ కారణం ఉంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో అర్ష్‌దీప్ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ తరఫున పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు (61 మ్యాచుల్లో 97 వికెట్లు) పడగొట్టిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. యుజ్వేంద్ర చాహల్ (96 వికెట్లు)ను అతడు అధిగమించి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. చాహల్ రికార్డును బ్రేక్ చేసిన అర్ష్‌దీప్ మీద సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన స్పీడ్‌స్టర్.. సీనియర్ స్పిన్నర్‌కు సారీ చెప్పాడు.


అంతా అద్భుతం!

నీ రికార్డును అధిగమించినందుకు నన్ను క్షమించు అంటూ చెవులు పట్టుకొని మరీ చాహల్‌కు క్షమాపణలు చెప్పాడు అర్ష్‌దీప్. అయితే సీరియస్‌గా కాకుండా కాస్త నవ్వుతూ, టీజ్ చేస్తూ సారీ చెప్పాడు. ఆ తర్వాత ఈ ఫీట్‌ను అందుకోవడంపై స్పందించాడు. ‘అద్భుతంగా అనిపిస్తోంది. ఇన్నాళ్లు నేను పడిన కష్టానికి, శ్రమకు సరైన ఫలితం దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దేశం తరపున ఇలాగే ఆడేందుకు ప్రయత్నిస్తా. మరిన్ని వికెట్లు తీస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించేందుకు ట్రై చేస్తా’ అని అర్ష్‌దీప్ చెప్పుకొచ్చాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సూపర్బ్‌గా బౌలింగ్ చేశాడని మెచ్చుకున్నాడు. మిడిల్ ఓవర్లలో అతడు వికెట్లు తీయకపోతే ఇంగ్లండ్ భారీగా పరుగులు పిండుకునేదన్నాడు. వరుణ్ వల్ల వరుస క్రమంలో వికెట్లు పడటం, ఇతర బౌలర్లు అదరగొట్టడంతో తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగామన్నాడు అర్ష్‌దీప్. పేసర్ సారీ చెప్పడంపై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. రికార్డు బ్రేక్ చేసినందుకు క్షమాపణులు చెబుతూ చాహల్‌ను సున్నితంగా హర్ట్ చేశాడని.. అర్ష్‌దీప్ నిజంగా ఫన్నీ అంటున్నారు.


ఇవీ చదవండి:

కోహ్లీని భయపెడుతున్న సూర్య.. అనుకున్నదే అవుతోంది

వచ్చాడు.. ఔట్ అయ్యాడు.. రిపీట్.. దేవుడే కాపాడాలి

కోహ్లీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 23 , 2025 | 06:07 PM