Share News

APL 2025 Auction: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలం స్టార్ట్.. ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీల పోటాపోటీ!

ABN , Publish Date - Jul 14 , 2025 | 05:26 PM

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 కోసం ప్లేయర్ల ఆక్షన్ ప్రక్రియ మొదలైంది. విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో వేలం జరుగుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..

APL 2025 Auction: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలం స్టార్ట్.. ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీల పోటాపోటీ!
Andhra Premier League 2025

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నయా సీజన్‌‌కు ముందు వేలం ప్రక్రియ షురూ అయింది. విశాఖపట్నం హోటల్ రాడిసన్ బ్లూలో ఆక్షన్ జరుగుతోంది. ఈసారి వేలంలో ఏకంగా 520 మంది ఆటగాళ్లు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఆల్‌రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. వేలంలో ఆల్‌రౌండర్లు జాక్‌పాట్ కొడుతున్నారు. పైలా అవినాష్‌ను రూ.11.5 లక్షలకు రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు దక్కించుకుంది. పీవీ సత్యానారాయణ రాజును రూ.9.8 లక్షలకు సొంతం చేసుకుంది భీమవరం బుల్స్ టీమ్.


ఆల్‌రౌండర్ల‌కు అదిరిపోయే ధర..

త్రిపురాన విజయ్‌ను రూ. 7.55 లక్షలు పెట్టి దక్కించుకుంది సింహాద్రి వైజాగ్ లయన్స్. సౌరభ్ కుమార్‌ను రూ.8.80 లక్షలకు సొంతం చేసుకుంది తుంగభద్ర వారియర్స్ జట్టు. యర్రా పృథ్వీరాజ్‌ను రూ.8.05 లక్షల ధరకు దక్కించుకుంది విజయవాడ సన్ షైనర్స్. జి.మ‌నీష్‌ రూ.3.45 ల‌క్ష‌ల‌ ధర పలికాడు. అతడ్ని కాకినాడ కింగ్స్ జట్టు కొనుక్కుంది. పి.గిరినాథ్ రెడ్డి రూ.10.05 లక్షల ధర పలికాడు. అతడ్ని రాయలసీమ రాయల్స్ టీమ్ సొంతం చేసుకుంది. ఎమ్.ధీర‌జ్ కుమార్‌ను రూ.6.05 ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకుంది విజ‌య‌వాడ స‌న్ షైన‌ర్స్. పి.త‌ప‌స్వీని రూ.5.30 ల‌క్ష‌ల‌ు పోసి తమ జట్టులోకి తెచ్చుకుంది కాకినాడ కింగ్స్. కాగా, ఏపీఎల్ సీజన్-4లో అమ‌రావ‌తి రాయ‌ల్స్, విజ‌య‌వాడ స‌న్ షైనర్స్, రాయ‌ల్స్ ఆఫ్ రాయ‌ల‌సీమ‌, తుంగ‌భ‌ద్ర వారియ‌ర్స్, సింహాద్రి వైజాగ్ వారియ‌ర్స్, కాకినాడ కింగ్స్, భీమ‌వ‌రం బుల్స్.. ఇలా 7 జట్లు పాల్గొంటున్నాయి. ఐపీఎల్ తరహాలో ప్లేయర్ల ఆక్షన్‌ను నిర్వహిస్తున్నారు.


ఇవీ చదవండి:

సిరాజ్ దొరికినా గిల్ తప్పించుకున్నాడు!

ఎంత పని చేశావ్ ఆర్చర్?

ఇంగ్లండ్‌కు ఇచ్చిపడేసిన సుందర్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 14 , 2025 | 05:30 PM