Share News

Dhoni-Rayudu: ధోని విషయంలో అలాగే మాట్లాడతా.. రాయుడు సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 10 , 2025 | 05:08 PM

MS Dhoni: ఎంఎస్ ధోని విషయంలో తాను అలాగే మాట్లాడతానని అన్నాడు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ రాయుడు ఎందుకు సీరియస్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..

Dhoni-Rayudu: ధోని విషయంలో అలాగే మాట్లాడతా.. రాయుడు సంచలన వ్యాఖ్యలు
Ambati Rayudu

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియా వేదికగా తన మీద వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌పై అతడు ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఎవ్వరేం అనుకున్నా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు, మహేంద్ర సింగ్ ధోనీకి తన మద్దతు ఇలాగే కొనసాగుతుందని అతడు స్పష్టం చేశాడు. ధోని విషయంలో తాను ఇలాగే మాట్లాడతానని క్లారిటీ ఇచ్చాడు. తాను మాహీకి ఫ్యాన్‌నని, ఇప్పుడు కూడా అభిమానం అలాగే ఉందని.. ఎప్పటికీ అతడికి ఫ్యాన్‌గానే ఉంటానని రాయుడు కుండబద్దలు కొట్టాడు.


పోయేదేం లేదు

ధోనీకి మద్దతు విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదన్నాడు రాయుడు. ఎవరేం అనుకుంటున్నారో తాను పట్టించుకోనని చెప్పుకొచ్చాడు. ఎవరేం అనుకున్నా తనకు పోయేదేం లేదని.. తాను 1 పర్సెంట్ కూడా పట్టించుకోనన్నాడు వెటరన్ బ్యాటర్. కాబట్టి తనపై ట్రోలింగ్ కోసం డబ్బులు ఖర్చులు చేయడం మానేయాలని.. దానికి బదులు ఆ డబ్బుల్ని అభాగ్యులకు ఇచ్చి సాయం చేయాలని సూచించాడు. కాగా, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడాడు రాయుడు. సీఎస్‌కేకు ఆడుతూ రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత కూడా ఆ టీమ్‌కు, ధోనీకి ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటూ వచ్చాడు. అయితే సోషల్ మీడియా వేదికగా యాంటీ సీఎస్‌కే, యాంటీ ధోని ఫ్యాన్స్‌ రాయుడ్ని టార్గెట్ చేసుకొని ట్రోలింగ్‌కు దిగడం.. దానికి అతడు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వడం లాంటివి ఈ సీజన్‌లో ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే మరోమారు ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చాడు రాయుడు.


ఇవీ చదవండి:

ప్లేయింగ్ 11తో దడ పుట్టిస్తున్నారు

ఆర్సీబీ వర్సెస్ డీసీ.. అడ్డగిస్తారా..

ఒక్క చాన్స్ అంటున్న కోహ్లీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2025 | 05:14 PM