BCCI-Team India: టీమిండియా నుంచి తెలుగోడు ఔట్.. గంభీర్ ప్లాన్ ప్రకారమే..
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:19 PM
Gautam Gambhir: ఒకవైపు అంతా ఐపీఎల్ హడావుడిలో ఉంటే మరోవైపు భారత జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి అభిషేక్ నాయర్‌తో పాటు తెలుగోడికి ఉద్వాసన పలికింది బీసీసీఐ. దీని వెనుక హెడ్ కోచ్ గంభీర్ హస్తం ఉందనే పుకార్లు వస్తున్నాయి.

ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా ఇప్పుడు ఐపీఎల్‌తో బిజీబిజీగా ఉన్నారు. హాట్ సమ్మర్‌లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌లతో మరింత హీటెక్కిస్తున్నారు ప్లేయర్లు. వాళ్ల ఆటతీరును చూస్తూ ఎంచక్కా చిల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఏయే టీమ్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్తాయి.. ఎవరు కప్పు కొడతారంటూ.. అంతా ఆలోచనల్లో మునిగిపోయారు. ఈ తరుణంలో అటు భారత జట్టు మేనేజ్‌మెంట్‌లో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌తో పాటు కండీషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ మీద వేటు వేసింది బీసీసీఐ.
పక్కా స్కెచ్
గతేడాది స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఓటమి పాలైంది. ఆ తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతుల్లోనూ పరాభవాన్ని చవిచూసింది. దీంతో ఈ ఫెయిల్యూర్స్, పేలవ ప్రదర్శనను కారణంగా చూపిస్తూ టి దిలీప్, అభిషేక్‌కు ఉద్వాసన పలకాలని బీసీసీఐ నిర్ణయించిందని తెలుస్తోంది. అభిషేక్ నాయర్ బ్యాటింగ్ కోచ్‌గా తన మార్క్ చూపించలేకపోయాడు. టెస్టుల్లో టీమ్ వరుస పరాభవాలకు బ్యాటింగ్ వైఫల్యం మెయిన్ రీజన్‌గా నిలిచింది. కాబట్టి అతడ్ని తప్పించడం సబబుగా అనిపించినా.. తెలుగోడు టి దిలీప్‌ను ఉన్నట్లుండి పక్కనబెట్టడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. దీని వెనుక హెడ్ కోచ్ గంభీర్ స్కెచ్ ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన ప్లేస్‌ను కాపాడుకోవడానికి వీళ్లిద్దర్నీ అతడు బయటకు పంపించాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏ రీజన్ లేకున్నా..
మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ హయాంలో దాదాపు 3 ఏళ్ల పాటు టీమిండియాకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలు అందించాడు టి దిలీప్. టీ20 వరల్డ్ కప్-2024లో భారత ఆటగాళ్లు అంత అద్భుతంగా ఫీల్డింగ్ చేశారంటే అది అతడి కోచింగ్ మహిమే. అందుకే ద్రవిడ్ అండ్ కో వెళ్లిపోయాక కూడా టి దిలీప్‌ను కంటిన్యూ చేస్తూ వచ్చింది బీసీసీఐ. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ-2025ను టీమిండియా నెగ్గడంలోనూ ఫీల్డింగ్ కోచ్‌గా తన వంతు పాత్రను అద్భుతంగా పోషించాడు దిలీప్. అలాంటోడ్ని హఠాత్తుగా వెనక్కి పంపడం వెనుక గంభీర్ హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కివీస్ సిరీస్, బీజీటీ వైఫల్యానికి అభిషేక్ నాయర్‌తో పాటు దిలీప్‌ను కూడా కారణంగా చూపి గౌతీ ఎస్కేప్ అయ్యాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీమిండియా ఫీల్డింగ్ లెవల్స్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లిన దిలీప్‌ను ఇది అవమానించడమేననే వ్యాఖ్యలు వస్తున్నాయి. తాను సేఫ్ అవ్వడానికి దిలీప్‌ను గంభీర్ బలి చేశాడనే విమర్శలు వస్తున్నాయి. ఏ కారణం లేకుండా అంత సక్సెస్ రికార్డు ఉన్నోడ్ని పక్కనబెట్టడం టీమ్‌కు ఏమాత్రం మంచిది కాదని.. పగబట్టి చేసిన పనిలాగే ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.
ఇవీ చదవండి:
నాయర్.. దిలీప్‌కు ఊహించని షాక్
బీసీసీఐ అంబుడ్స్‌మన్ కీలక ఉత్తర్వులు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి