Share News

Abhishek Sharma: అతడి కోసమే ఈ ఊచకోత.. సీక్రెట్ బయటపెట్టిన అభిషేక్

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:11 PM

IND vs ENG: ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20లో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగాడు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ. జోఫ్రా ఆర్చర్ మొదలుకొని ఆదిల్ రషీద్ వరకు ఎవ్వర్నీ వదలకుండా పిచ్చకొట్టుడు కొట్టాడు.

Abhishek Sharma: అతడి కోసమే ఈ ఊచకోత.. సీక్రెట్ బయటపెట్టిన అభిషేక్
Abhishek Sharma

సంచలన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను షేక్ చేశాడు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ. బౌండరీలు, సిక్సులతో హోరెత్తించాడు. ఉరుములు, మెరుపులతో స్టేడియం దద్దరిల్లేలా చేశాడు. బట్లర్ సేన మీద తుఫానులా విరుచుకు పడ్డాడు. 7 బౌండరీలు, 13 సిక్సులతో ఆ టీమ్ బెండు తీశాడు. జోఫ్రా ఆర్చర్ దగ్గర నుంచి మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ వరకు ఎదురొచ్చిన ప్రతి బౌలర్‌ను ఉతికిఆరేశాడు. బంతి వేయాలంటే భయపడేలా వణికించాడు. 54 బంతుల్లో 135 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆఖరి మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశాడు. అతడి కారణంగా ఏకంగా 150 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది భారత్. ఈ మ్యాచ్ తర్వాత అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు ఏమన్నాడంటే..


ఆయనొక్కడే నమ్మాడు!

వాంఖడే ఇన్నింగ్స్‌ను తన గురువు యువరాజ్ సింగ్‌కు అంకితం చేశాడు అభిషేక్. ఈ ఊచకోత నాక్ అతడి కోసమే అన్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు సంతోషిస్తాడని భావిస్తున్నట్లు తెలిపాడు. 15 నుంచి 16వ ఓవర్ దాకా తాను బ్యాటింగ్ చేయాలని, అప్పటివరకు క్రీజులో ఉండాలని యువీ చెబుతూ ఉండేవాడని అభిషేక్ గుర్తుచేసుకున్నాడు. తనను నమ్మిన ఏకైక వ్యక్తి యువీ పాజీ అంటూ ఎమోషనల్ అయ్యాడు. నువ్వు ఇండియాకు తప్పకుండా ఆడతావ్.. టీమ్‌ను గెలిపిస్తావ్ కూడా అంటూ తనలో ఆయన విశ్వాసం నింపాడని అభిషేక్ చెప్పుకొచ్చాడు.


వాళ్ల కోసమే సెలబ్రేషన్..

‘యువరాజ్ సింగ్ నన్ను ఎంతో నమ్మారు. నువ్వు తప్పకుండా భారత్‌కు ఆడతావంటూ నాలో కాన్ఫిడెన్స్ నింపారు. నా కెరీర్‌లో ఆయనది కీలకమైన పాత్ర అని చెప్పాలి. ఆయన వల్లే నేను ఇక్కడి వరకు రాగలిగాను. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. ప్రతి మ్యాచ్ తర్వాత యువీ పాజీతో మాట్లాడతా. ఆయన చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తా. నా ఆట గురించి నా కంటే ఆయనకే బాగా తెలుసు’ అని అభిషేక్ చెప్పుకొచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌పై సంతృప్తిగా ఉన్నానని అన్నాడు. సెంచరీ తర్వాత ఫ్యామిలీ కోసమే వాళ్ల వైపు చూస్తూ సెలబ్రేట్ చేసుకున్నానని పేర్కొన్నాడు.


ఇవీ చదవండి:

ఇంగ్లండ్ పరువు తీసిన శివమ్ దూబె.. తల ఎత్తుకోకుండా చేశాడు

అభిషేక్‌ ఒక మెంటలోడు.. నితీష్ ఇలా అనేశాడేంటి

ఈ పగ చల్లారదు.. యువీతో ఆగలేదు.. అభిషేక్‌తో అంతమవదు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 12:19 PM