Share News

AB De Villiers: ఆ తప్పు చేస్తే అంతే సంగతులు.. బీసీసీఐకి ఏబీడీ స్ట్రాంగ్ వార్నింగ్!

ABN , Publish Date - Jun 30 , 2025 | 01:50 PM

భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ మీద సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దయచేసి ఆ తప్పు చేయొద్దని బీసీసీఐకి సూచించాడు.

AB De Villiers: ఆ తప్పు చేస్తే అంతే సంగతులు.. బీసీసీఐకి ఏబీడీ స్ట్రాంగ్ వార్నింగ్!
Jasprit Bumrah

పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా విషయంలో ఆ తప్పు చేయొద్దని అంటున్నాడు ఏబీ డివిలియర్స్. అతడి వర్క్ లోడ్ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి, పదిసార్లు ఆలోచించుకోవాలని చెబుతున్నాడు. దీనికి బుమ్రా విషయంలో భారత క్రికెట్ బోర్డు, టీమ్ మేనేజ్‌మెంట్ భయపడుతుండటమే కారణం. ఇంగ్లండ్ సిరీస్‌లో ఈ స్పీడ్‌స్టర్ 3 టెస్టులే ఆడతాడని, అన్ని మ్యాచులు ఆడడని అటు నుంచి బీసీసీఐ, ఇటు నుంచి టీమ్ మేనేజ్‌మెంట్ చెబుతుండటంపై ఏబీడీ సీరియస్ అయ్యాడు.

bumrah.jpg


నో రెస్ట్..

‘బుమ్రా దునియాలోనే నంబర్ వన్ బౌలర్. 5 టెస్టుల సిరీస్‌లో కేవలం మూడు మ్యాచుల్లోనే అతడ్ని ఆడించాలని అనుకోవడం సరైన నిర్ణయం కాదు. అతడ్ని పూర్తి సిరీస్‌లో ఆడించాలి. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ పేరుతో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనుకోవడం సరికాదు. ఆ తప్పు అస్సలు చేయొద్దు. ఒకవేళ ఈ పేసర్‌కు రెస్ట్ ఇవ్వాలని అనుకుంటే వన్డేలు, టీ20ల్లో ఆడించొద్దు. అంతేగానీ టెస్టుల్లో మాత్రం అతడి సేవల్ని పూర్తిగా వాడుకోవాలి’ అని ఓ యూట్యూబ్‌ చానల్‌లో చెప్పుకొచ్చాడు ఏబీడీ.

jasprit.jpg


స్టెయిన్ ఫార్ములా..

సౌతాఫ్రికా టీమ్‌కు తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు డేల్ స్టెయిన్ వర్క్ లోడ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకున్నామని డివిలియర్స్ అన్నాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి బడా జట్లతో జరిగే టెస్ట్ సిరీస్‌ల్లోనే అతడ్ని ఆడించేవాళ్లమని గుర్తుచేశాడు ఏబీడీ. టీ20, వన్డే మ్యాచుల్లో స్టెయిన్‌కు రెస్ట్ ఇచ్చేవాళ్లమని తెలిపాడు. టీమిండియా కూడా బుమ్రా విషయంలో ఇలాగే వ్యవహరించాలని.. అతడ్ని సేవల్ని సమర్థంగా, జాగ్రత్తగా వాడుకోవాలని డివిలియర్స్ సూచించాడు. మరి.. జస్‌ప్రీత్ బుమ్రా విషయంలో టీమిండియా ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.


ఇవీ చదవండి:

గిల్ సేనను శనిలా తగులుకున్నాడు

టీమిండియా కోసం ఇంగ్లండ్ లెజెండ్

6 నెలలు ఒక్క మాట అనలేదు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 30 , 2025 | 02:04 PM