Share News

Shubman Gill: ఈసారి ఐదు రికార్డులపై శుభ్‌మాన్ గిల్ ఫోకస్..బ్రేక్ చేస్తాడా

ABN , Publish Date - Jul 30 , 2025 | 01:50 PM

ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో టీం ఇండియా ప్రస్తుతం 1-2తో వెనుకబడినప్పటికీ, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఐదో, చివరి టెస్ట్‌ మ్యాచ్‌ నేపథ్యంలో గిల్ ముందు ఐదు రికార్డులు ఉన్నాయి.

Shubman Gill: ఈసారి ఐదు రికార్డులపై శుభ్‌మాన్ గిల్ ఫోకస్..బ్రేక్ చేస్తాడా
Shubman Gill England vs India

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీం ఇండియా (England vs India) ప్రస్తుతం 1-2తో వెనుకంజలో ఉన్నా కూడా, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) మాత్రం తన బ్యాటింగ్‌తో అందరినీ మెప్పిస్తున్నాడు. ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్‌ల్లో గిల్ 722 పరుగులు చేసి, 90.25 సగటుతో రాణిస్తున్నాడు. నాలుగు శతకాలతో జైత్రయాత్ర సాగిస్తున్న గిల్ ఇప్పుడు ఐదో, చివరి టెస్ట్‌లో ఐదు ప్రపంచ రికార్డులను ఛేదించే అరుదైన ఛాన్స్ కలిగి ఉన్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న గిల్‌కి ఇది చారిత్రాత్మక మ్యాచ్ కానుంది.


మరో శతకం సాధిస్తే..

ఒక్క శతకం మిగిలి ఉంది గిల్‌కు.. అది కూడా సాధిస్తే విండీస్ దిగ్గజం క్లైడ్ వాల్కాట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేస్తాడు. 1955లో వాల్కాట్ ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో 5 శతకాలు సాధించారు. 89 ఏళ్లుగా ఆ రికార్డు మాత్రమే ఉంది. ఇప్పటివరకు గిల్ నాలుగు శతకాలు చేశాడు. ఓవల్‌లో ఐదో శతకం సాధిస్తే, వాల్కాట్‌ ప్రపంచ రికార్డును చేరుకుంటాడు.

వాల్కాట్‌ను దాటి పోతాడా?

వాల్కాట్ 1955 సిరీస్‌లో మొత్తం 827 పరుగులు చేశాడు. గిల్ ఇప్పటి వరకు 722 పరుగులు చేసినా, ఓవల్ టెస్ట్‌లో రెండు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడగలిగితే ఈ రికార్డును బ్రేక్ చేయవచ్చు. ఇది కేవలం ప్రపంచ రికార్డుగానే కాకుండా, గిల్ కెరీర్‌కు ఒక అరుదైన మైలురాయిగా నిలవనుంది.


బ్రాడ్‌మాన్ రికార్డు కూడా..

1936-37 ఆశెస్ సిరీస్‌లో డాన్ బ్రాడ్‌మాన్ కెప్టెన్‌గా 810 పరుగులు చేశాడు. టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా చేసిన అత్యధిక పరుగుల రికార్డు ఇది. గిల్ ఇప్పటివరకు 722 పరుగులు చేశాడు. అంటే ఇంకా 89 పరుగులు చేస్తే బ్రాడ్‌మాన్ రికార్డు కూడా బ్రేక్ అవుతుంది.

సునీల్ గవాస్కర్ భారత రికార్డు కూడా

గవాస్కర్ 1971లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 774 పరుగులు చేశాడు. భారత ఆటగాళ్లలో టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత ఆయనదే. ఇప్పుడు గిల్ కేవలం 53 పరుగులు చేస్తే ఈ రికార్డును అధిగమిస్తాడు. ఓవల్ టెస్ట్‌లో గిల్ ఫామ్‌లో ఉంటే ఇది సాధ్యమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


కోహ్లీతో సమానంగా గిల్

ఒకే టెస్టు సిరీస్‌లో నాలుగు శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్ ఇప్పటికే దిగ్గజాలైన గవాస్కర్, విరాట్ కోహ్లీతో చేరిపోయాడు. ఐదో శతకం సాధిస్తే ఈ ఇద్దరినీ వెనక్కి నెట్టి ప్రత్యేక గుర్తింపు దక్కించుకోనున్నాడు. ఓవల్‌లో చివరి టెస్ట్ ప్రారంభం కాకముందే అభిమానులు గిల్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.


ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 30 , 2025 | 01:52 PM