Share News

Chennai News: ప్రాణం మీదకు తెచ్చిన ప్రేమ వ్యవహారం.. ఏం జరిగిందో తెలిస్తే..

ABN , Publish Date - Jul 30 , 2025 | 01:20 PM

తన స్నేహితుడి ప్రేమ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు వెళ్లిన ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. కారుతో ఢీకొట్టించి మరీ దుండగులు అతడిని పొట్టనపెట్టుకున్నారు. అన్నానగర్‌ తిరుమంగళం ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

Chennai News: ప్రాణం మీదకు తెచ్చిన ప్రేమ వ్యవహారం.. ఏం జరిగిందో తెలిస్తే..

- రాజీకి వెళ్లిన విద్యార్థి హతం

- కారుతో ఢీకొట్టించి హత్య చేసిన దుండగులు

చెన్నై: తన స్నేహితుడి ప్రేమ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు వెళ్లిన ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. కారుతో ఢీకొట్టించి మరీ దుండగులు అతడిని పొట్టనపెట్టుకున్నారు. అన్నానగర్‌ తిరుమంగళం ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా... అయనావరం ముత్తమ్మన్‌ వీధిలో నివసిస్తున్న నితిన్‌సాయి (21) నగరంలోని ఓ కాలేజీలో చదువుతున్నాడు.


సోమవారం రాత్రి తన స్నేహితుడు అభిషేక్‌తో కలిసి బైకుపై వెళ్తుండగా తిరుమంగళం స్కూలు రోడ్డు వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ సంఘటనలో నితిన్‌సాయి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైకు నడిపిన అభిషేక్‌ తీవ్రంగా గాయపడి కేఎంసీ ఆస్పత్రి(KMC Hospital)లో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


nani4.2.jfif

ఓ యువతి ప్రేమవిషయమై ఏర్పడిన తగాదా నేపథ్యంలో నితిన్‌సాయిని కారుతో ఢీకొట్టించి హత్య చేసినట్లు తెలియడంతో పోలీసులు హత్యకేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. నితిన్‌సాయి స్నేహితుడు వెంకటేష్‌ ఓ అమ్మాయిని ప్రేమించాడని, తరచూ ఆమె వెంటబడుతుండేవాడని, ఈ విషయం నచ్చక ఆ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ ప్రణవ్‌కు చెప్పింది. దీంతో వెంకటే్‌షకు ప్రణవ్‌ ఫోన్‌ చేసి అమ్మాయిని ప్రేమపేరుతో వేధిస్తే పద్దతిగా ఉండదని బెదిరించాడు.


ఈ విషయాన్ని వెంకటేష్‌(Venkatesh) తన స్నేహితుడైన నితిన్‌సాయికి చెప్పి సాయం కోరాడు. ఈ నేపథ్యంలో నితిన్‌సాయి ప్రేమ వ్యవహారాన్ని చక్కదిద్దాలని ప్రణవ్‌ను కలుసుకునేందుకు తిరుమంగళంకు బైకుపై వెళ్ళినప్పుడు ప్రణవ్‌ అనుచరులు కారుతో బైకును ఢీకొట్టించి నితిన్‌సాయిని హతమార్చాడని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తి కేకేనగర్‌ ప్రాంతానికి చెందిన ప్రముఖ రాజకీయనేత బంధువని పోలీసు విచారణలో తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రావణ మాసంలో శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!

బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష

Read Latest Telangana News and National News

Updated Date - Jul 30 , 2025 | 01:20 PM