Smart Investment Plan: ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:59 PM
మీరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని కలలుకంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే సరైన ప్రణాళికతో మీరు కేవలం రెండేళ్ల లోనే రూ.10 లక్షల మొత్తాన్ని దక్కించుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

మీరు తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో డబ్బు పొందాలని చూస్తున్నారా. అందుకోసం ఓ చక్కటి ప్లాన్ ఉందని ఆర్థిక నిపుణులు (Smart Investment Plan) తెలిపారు. దీని ప్రకారం మీరు రెండేళ్లలోనే రూ.10 లక్షలు పొందవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. మీరు కొత్త కారు కొనుగోలు, పెళ్లి ఖర్చులు లేదా అత్యవసర నిధులు ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు.
దీని కోసం నెలకు..
రెండు సంవత్సరాల్లో రూ. 10 లక్షలు రాబట్టడం కొంచెం కష్టం అనిపించవచ్చు. కానీ సరైన ప్లానింగ్, డిసిప్లిన్‌తో మీరు ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. దీని కోసం మీరు నెలకు రూ. 40,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
1. మ్యూచువల్ ఫండ్ SIPలలో పెట్టుబడి
నెలసరి పెట్టుబడి: రూ. 20,000
సాదారణ రాబడులు: దాదాపు 12%
మొత్తం పెట్టుబడి: రూ. 4.8 లక్షలు (రెండేళ్లకు)
వచ్చే రాబడి : రూ. 61,300
మొత్తం విలువ: దాదాపు రూ. 5.41 లక్షలు
మ్యూచువల్ ఫండ్లలో రాబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇవి మార్కెట్‌కు సంబంధించినవి కావడంతో కొంత హెచ్చుతగ్గులు అయ్యే ఛాన్సుంది. అందుకే దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తక్కువగా ఉంటుంది.
2. బంగారంపై పెట్టుబడి
నెలసరి పెట్టుబడి: రూ. 20,000
ఊహించదగిన రాబడి: సుమారుగా 10%
మొత్తం పెట్టుబడి: రూ. 4.8 లక్షలు (రెండేళ్లకు)
వచ్చే లాభం అంచనా: రూ. 50,903
మొత్తం విలువ: దాదాపుగా రూ. 5.31 లక్షలు
బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా గుర్తింపు పొందింది. దీని ధరలలో కొంత హెచ్చుతగ్గులు ఉండవచ్చు కానీ దీర్ఘకాలంలో లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
డిసిప్లిన్‌తో పెట్టుబడి
ఒక్కోసారి ఖర్చులు పెరగవచ్చు. అయినా సరే, ప్రతినెలా డబ్బు సేవ్ చేయడంలో క్రమశిక్షణ పాటించాలి. దీనికోసం మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ సెటప్ చేసుకోవాలి.
మార్కెట్ మార్పులకు భయపడకండి
మార్కెట్ తాత్కాలికంగా పడిపోతే భయపడవద్దు. వెంటనే ఇన్వెస్ట్‌మెంట్లను తీసేయకండి. ఇది సాధారణమే. కానీ మీరు పెట్టుబడి చేసిన స్కీములు కచ్చితంగా మంచి ఫలితాలను అందిస్తాయి.
గమనిక: ఇన్వెస్ట్ మెంట్ స్కీంలలో పెట్టుబడులు చేయాలని ఆంధ్రజ్యోతి సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు ఆసక్తి ఉంటే నిపుణుల సలహా సూచనలు తీసుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి
రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికాలో సునామీ అలర్ట్
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి