Share News

Ashes 2025: అదరగొట్టిన ట్రావిస్‌ హెడ్‌.. ఆస్ట్రేలియా ఘన విజయం

ABN , Publish Date - Nov 22 , 2025 | 03:26 PM

యాషెస్ సిరీస్ 2025లో భాగంగా పెర్త్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీ చేయడంతో ఆ జట్టు సునాయసంగా విజయం సాధించింది

Ashes 2025: అదరగొట్టిన ట్రావిస్‌ హెడ్‌.. ఆస్ట్రేలియా ఘన విజయం
Australia vs England 1st Test

యాషెస్ సిరీస్(Ashes 2025)లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పెర్త్‌ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టు.. శనివారం నాటి రెండో రోజే ఆట ముగిసింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 28.2 ఓవర్లలోనే ఛేదించింది. ఆస్ట్రేలియా(Australia) స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీ(123) చేసి.. ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 83 బంతుల్లో 123 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన లబుషేన్‌ రెండో ఇన్నింగ్స్ లో( 49 బంతుల్లో 51 పరుగులు) బాగా రాణించాడు.


తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 205 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగింది. ఆరంభం నుంచే ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ట్రావిస్ హెడ్(Travis Head ).. టీ20 మ్యాచ్ తరహాలో ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. అతను 36 బంతుల్లో అర్ధ శతకం, 69 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. బెన్ స్టోక్స్ వేసిన 17 ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో కలిపి మొత్తం నాలుగు బౌండరీలు రాబట్టాడు. అనంతరం అట్కిన్సన్‌(Gus Atkinson) వేసిన 20 ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టి 90ల్లోకి వచ్చేసి కాసేపటికే శతకం పూర్తి చేసుకున్నాడు. హెడ్, లబుషేన్ రెండో వికెట్‌కు 92 బంతుల్లో 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బ్రైడన్‌ కార్స్‌ బౌలింగ్ లో192 పరుగుల వద్ద రెండో వికెట్ గా ట్రావిస్ హెడ్ వెనుతిరిగాడు. అయితే అప్పటికే ఆస్ట్రేలియా విజయం దాదాపు ఖరారైంది.


తొలి రోజే 19 వికెట్లు:

యాషెష్(Ashes 2025)లో భాగంగా శుక్రవారం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. అయితే మ్యాచ్‌లో తొలి రోజే 19 వికెట్లు కూలాయి. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 172 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో సెషన్ లో 9 వికెట్లు కోల్పోయింది. ఇక ఓవర్‌నైట్‌ స్కోర్‌ 123/9తో రెండో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌(Australia) 132 పరుగులకు ఆలౌటైంది. 40 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆశించిన మేర రాణించలేదు.


ఇంగ్లాండ్(England) బ్యాటర్లు అందరూ విఫలం కావడంతో 164 స్వల్ప పరుగులు మాత్రమే చేయగలిగింది. గస్ అట్కిన్సన్ (37) టాప్ స్కోరర్. బెన్ డకెట్ (28), ఓలీ పోప్ (33)), బ్రైడన్ కార్స్ (20), జేమీ స్మిత్ (15) పరుగులు చేశారు. ఆసీస్ పేసర్లు బోలాండ్ (4/33), మిచెల్ స్టార్క్ (3/55), డాగెట్ (3/51) సత్తాచాటారు. తొలి ఇన్నింగ్స్ 40 పరుగల ఆధిక్యం కలుపుకుని మొత్తం 205 పరుగుల టార్గెట్ ను ఆస్ట్రేలియా ముందు ఉంచగా..ట్రావిస్ హెడ్(Head) ఆ స్కోర్ ను ఉఫ్ నా ఊదేశాడు. మొత్తంగా తొలి టెస్టులో హెడ్ హీరోగా నిలిచాడు.



ఇవీ చదవండి:

స్మృతిని సర్‌ప్రైజ్ చేస్తూ పలాశ్ ప్రపోజ్.. వాహ్ అనాల్సిందే.!

ఆ స్థానంపై ప్రయోగాలెందుకు?: ఆకాశ్ చోప్రా

Updated Date - Nov 22 , 2025 | 04:32 PM