Share News

Funny classroom clip: తెలివి తక్కువ వారిని నిలబడమంటే.. స్టూడెంట్ చేసిన పనికి టీచర్ షాక్..

ABN , Publish Date - Nov 22 , 2025 | 03:39 PM

తాజాగా ఓ క్లాస్ రూమ్‌లో జరిగిన ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ కుర్రాడు చెప్పిన సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ కుర్రాడు చెప్పిన సమాధానం విని విద్యార్థులందరూ పగలబడి నవ్వుకున్నారు.

Funny classroom clip: తెలివి తక్కువ వారిని నిలబడమంటే.. స్టూడెంట్ చేసిన పనికి టీచర్ షాక్..
viral school incident

సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ క్లాస్ రూమ్‌లో జరిగిన ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ కుర్రాడు చెప్పిన సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది (teacher student viral video).


respe_ctworld99 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కొంతమంది విద్యార్థులు ఒక తరగతిలో కూర్చున్నారు. అప్పుడు ఆ క్లాస్ టీచర్.. 'తరగతిలో ఎవరు తెలివి తక్కువవారో, లేచి నిలబడండి' అని అడిగారు. క్లాస్‌లో ఎవరూ పైకి లేచి నిలబడలేదు. చివరకు ఫస్ట్ లైన్‌లో కూర్చున్న విద్యార్థి లేచి టీచర్ పక్కన నిలబడ్డాడు. అప్పుడు టీచర్.. 'నువ్వు తెలివి తక్కువ వాడివా' అని అడిగారు. దానికి ఆ విద్యార్థి.. 'కాదు మేడమ్.. కానీ, మీరు ఒక్కరే నిలబడడం నాకు ఇష్టం లేదు' అని సమాధానం చెప్పాడు.


ఆ కుర్రాడు చెప్పిన సమాధానం విని విద్యార్థులందరూ పగలబడి నవ్వుకున్నారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోటి మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. నాలుగు లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. టీచర్‌కు దిమ్మతిరిగి ఉంటుందని ఒకరు కామెంట్ చేశారు. పాపం.. ఆ టీచర్‌కు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

మీ కళ్లకు టెస్ట్.. ఈ ఫొటోలో కొండచిలువ ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..


వామ్మో.. లవర్‌కు ఇలాంటి గిఫ్ట్ ఎవరైనా ఇస్తారా.. నెటిజన్లు ఏమంటున్నారంటే..


మరిన్ని వైరల్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 22 , 2025 | 03:39 PM