Mohan Bhagwat: హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికే ఉనికి ఉండదు.. మోహన్ భాగవత్
ABN , Publish Date - Nov 22 , 2025 | 02:58 PM
జాతుల మధ్య ఘర్షణలతో ఇటీవల కాలంలో అట్టుడికిన మణిపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడుతూ, హిందూ సమాజం ధర్మానికి ప్రపంచ సంరక్షుడిగా ఉందన్నారు. భారత్ అంటే అమర నాగరికతకు పేరని చెప్పారు.
ఇంఫాల్: ప్రపంచాన్ని నిలబెట్టడంలో హిందూ సమాజం కీలకమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) అన్నారు. హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికే ఉనికి ఉండదని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి దేశం అన్ని రకాల పరిస్థితులను చూసిందని, యునాన్ (గ్రీస్) మిస్ర్ (ఈజిప్టు), రోమ్ వంటి సామ్రాజ్యాలు, నాగరికతలు కనుమరుగైనా హిందూ సమాజం చెక్కుచెదరలేదని చెప్పారు.
జాతుల మధ్య ఘర్షణలతో ఇటీవల కాలంలో అట్టుడికిన మణిపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడుతూ, హిందూ సమాజం ధర్మానికి ప్రపంచ సంరక్షుడిగా ఉందన్నారు. భారత్ అంటే అమర నాగరికతకు పేరని, సమాజంలో అలాంటి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నందునే హిందూ కమ్యూనిటీ చెక్కుచెదరకుండా ఉందని, హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచమే ఉనికి కోల్పోతుందని అన్నారు. ఇండియాలో ఉన్నవారంతా హిందువులేనని, హిందూ వారసత్వానికి చెందినవారే ముస్లింలు, క్రిస్టియన్లని చెప్పారు.
ఆర్థిక స్వావలంభన
దేశ పటిష్టతకు ఆర్థిక స్వావలంభన చాలా కీలకమని మోహన్ భాగవత్ అన్నారు. దేశ నిర్మాణంలో మిలటరీ సామర్థ్యం, నాలెడ్జ్ కెపాసిటీకి సమ ప్రాధాన్యత ఉందని చెప్పారు. దేశ నిర్మాణం జరగలాంటే బలం కావాలని, బలం అంటే ఆర్థిక సామర్థ్యమని చెప్పారు. ఆధిపత్యం అనే పదానికి ఒక్కోసారి విపరీత అర్థం వస్తుందన్నారు. అయితే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎవరిపైనా ఆధారపడకూడదని అన్నారు. ఇదేమంత కష్టమైన పని కూడా కాదని చెప్పారు.
నక్సలిజం తగ్గుముఖం పట్టడంపై మాట్లాడుతూ, నక్సలిజాన్ని ఇంకెంత మాత్రం సహించేది లేదని సమాజం నిర్ణయించుకోవడమే ఇందుకు కారణమని అన్నారు. బ్రిటిష్ వారిపై జరిగిన స్వాతంత్ర్య పోరాటాన్ని ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. 'బ్రిటిష్ సామాజ్యంలో రవి అస్తమించడు. కానీ ఇండియాలో వారి సూర్యుడు అప్పటికే అస్తమించాడు. 90 ఏళ్లపాటు ప్రయత్నాలు సాగించాం. అణచివేతకు ఎన్నడూ తలవంచలేదు. కొన్నిసార్లు మన గళం బలహీనంగా ఉండి ఉండవచ్చు, కొన్ని సార్లు బలంగా వినిపించి ఉండవచ్చు. కానీ మన గళం ఎన్నడూ మూగవోలేదు' అని మోహన్ భాగవత్ వివరించారు.
ఇవి కూడా చదవండి..
అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉగ్ర మూలాలు.. 600 మంది విద్యార్థుల జీవితం నాశనం!
తేజస్ ప్రమాదం.. ఇంతకీ ఎవరీ నమాన్ష్..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..