Share News

Chennai News: చెన్నై నగరంలో మళ్లీ డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:45 AM

చెన్నై నగరంలో మళ్లీ డబుల్‌ డెక్కర్‌ బస్సులు నడిపేందుకు చెన్నై మహానగర రవాణా సంస్థ నిర్ణయించింది. ఇదివరకు డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఉండేవి. ఆ తర్వాత వాటిని తీసివేశారు. కాగా... మళ్లీ డబుల్‌ డెక్కర్‌ బస్సులను సిటీలో సేవలందించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.

Chennai News: చెన్నై నగరంలో మళ్లీ డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

చెన్నై: వచ్చే యేడాది జనవరి నుంచి నగరంలో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు మళ్ళీ పరుగులు తీయనున్నాయి. రెండు దశాబ్దాల తర్వాత కొత్త సదుపాయాలతో తయారైన ఈ బస్సులను మహానగర రవాణా సంస్థ కొనుగోలు చేసింది. ఇటీవల నగరం నలుమూలలా ప్రయోగాత్మకంగా నడిపారు. నగరంలో తాంబరం నుండి బ్రాడ్వే వరకు నడిచిన 18ఎ నెంబరు డబుల్‌ డెక్కర్‌ బస్సులు నడిచేవి. 2008లో ఫ్లైఓవర్ల నిర్మాణాలు జరుగుతుండటంతో ఆ బస్సులను నిలిపివేశారు.


nani2.2.jpg

ఆ తర్వాత మళ్లీ నగరంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపేందుకు మహానగర రవాణా సంస్థ (ఎంటీసీ) సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుతం ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త బస్సులను కొనుగోలు చేసి నడుపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సోషల్‌ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు

రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణం!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 22 , 2025 | 11:45 AM