Home » Manipur
అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఇంఫాల్‌లోని కావాకేథేల్, యురిపోక్‌లో రోడ్లపైకి వచ్చారు, టైర్లు, పాత సామగ్రికి నిప్పుపెట్టారు. దీంతో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
మణిపూర్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారని, ఆ కారణంగానే తాము గవర్నర్‌ను కలిసామని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సపమ్ నిషికాంత సింగ్ తెలిపారు.
నిరసనకారులు ఇంఫాల్ వెస్ట్‌లోని లామ్మేల్‌పాట్‌లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్టోరల్ కార్యాలయాలకు తాళాలు వేశారు. గవర్న్‌మెంట్ ఆఫ్ ఇండియా అనే పేరున్న సైన్‌బోర్డ్‌కు మసిపూశారు. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్‌లలో ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిపారు.
మణిపూర్‌లో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు చిన్నారుల అనాథాశ్రమంపై కాల్పులకు తెగబడ్డారు.
రెండు తెగల మధ్య రేగిన విబేధాల కారణంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అల్లర్లు చెలరేగాయి. పరిస్థితిని అందుపులోకి తీసుకువచ్చేందుకు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. గత కొద్ది నెలలుగా పరిస్థితి సద్దుమణిగినట్లే ఉంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆ వివరాలు..
హింసాకాడంతో అట్టుడికిన మణిపూర్‌లో గత 22 నెలల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, సుమారు 60,000 మంది నిరాశ్రయులై సహాయ, పునరావస శిబిరాల్లో తలదాచుకుంటున్నారని జైరామ్ రమేష్ శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
మార్చి 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని మార్గాల్లోనూ ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలకు సాగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను అమిత్‌షా ఆదేశించారు. ప్రజల రాకపోకలను అడ్డుకోవడం, రోడ్ల దిగ్బంధనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Internet Shut downs : ఇండియాలో మరోసారి ఇంటర్నెట్ స్వేచ్ఛపై చర్చ మొదలైంది. 2024లో ఇంటర్నెట్ షట్‌డౌన్‌లకు సంబంధించిన డిజిటల్ హక్కుల సంస్థ విడుదల చేసిన నివేదికలో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి..
ఈరోజు నుంచి ఏడు రోజుల్లోపు అక్రమంగా తీసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో వచ్చి లొంగిపోవాలని మణిపూర్ గవర్నర్ ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన ఎందుకు అలా చెప్పారు. అసలు ఏమైందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
జాతి వైషమ్యాలతో అల్లకల్లోలంగా మారిన మణిపూర్‌లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ విషయాన్ని గురువారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది.