Share News

Arjun Tendulkar: ఓపెనర్‌గా అర్జున్ టెండూల్కర్

ABN , Publish Date - Nov 29 , 2025 | 05:06 PM

పేస్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవా తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. బ్యాటింగ్‌లో పెద్దగా రాణించ లేకపోయినా, బౌలింగ్‌లో కీలక వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

Arjun Tendulkar: ఓపెనర్‌గా అర్జున్ టెండూల్కర్
Arjun Tendulkar

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కొత్త అవతారమెత్తాడు. సాధారణంగా పేస్ ఆల్‌రౌండర్ అయిన అతడు ఓపెనర్‌గా మారాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్.. చండీఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.


అంతకు ముందు యూపీతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్జున్(Arjun Tendulkar) అంతగా రాణించలేకపోయారు. యూపీతో మ్యాచ్‌లో నాలుగు బౌండరీలు బాది 172 స్ట్రైక్ రేట్‌తో 28 పరుగులు చేశాడు. చండీఘడ్‌తో మ్యాచ్‌లో 9 బంతులు ఎదుర్కొని 3 బౌండరీలు బాది 14 పరుగులు చేసి.. దురదృష్టవశాత్తు రనౌట్‌గా పెవిలియన్ చేరాడు.


యూపీతో మ్యాచ్‌లో బౌలింగ్‌లో విఫలమైనా.. చండీఘడ్‌తో పోరులో మాత్రం 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో గోవా 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన అర్జున్ టెండూల్కర్.. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతను ఇలానే రాణిస్తే ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున తుది జట్టులో ఆడే అవకాశం దక్కడంలో అతిశయోక్తి లేదు.


ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్ రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్ టెండూల్కర్‌ను ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్ 2021లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు ఎంట్రీ ఇచ్చిన అర్జున్.. ఐపీఎల్ 2023 సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 2024లో ఒక మ్యాచ్ ఆడిన అర్జున్.. మూడు వికెట్లు పడగొట్టాడు.


ఇవి కూడా చదవండి:

కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం

పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?

Updated Date - Nov 29 , 2025 | 05:06 PM