CSK Cricketer Anirudha Srikkanth: బిగ్‌బాస్ బ్యూటీని పెళ్లి చేసుకోబోతున్న సీఎస్‌కే మాజీ క్రికెటర్!
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:28 PM
సీఎస్కే మాజీ క్రికెటర్ అనిరుధ శ్రీకాంత్.. తమిళ బిగ్ బాస్ బ్యూటీ సంయుక్తను వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల దీపావళి పండుగను ఈ ఇద్దరూ కలిసి జరుపుకోవడం, ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో వారి పెళ్లి ఊహాగానాలకు బరింత బలం చేకూరింది.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ కుమారుడైన అనిరుధ శ్రీకాంత్.. తమిళ బిగ్ బాస్ బ్యూటీ సంయుక్తను పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల దీపావళి పండుగను ఈ ఇద్దరూ కలిసి జరుపుకోవడం, ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో వారి పెళ్లి ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. వారి రిలేషన్‌షిప్ గురించి సంయుక్తను మీడియా ప్రశ్నించగా.. అంతా ఇంటర్నెట్‌లో ఉందని, అలానే తమ మధ్య ఏది ఉండాలో అదే ఉందని బదులిచ్చింది.
బిగ్ బాస్ బ్యూటీ సంయుక్త విషయానికి వస్తే.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె 2007లో మిస్ చెన్నైగా నిలిచింది. తమిళ బిగ్ బాస్ సీజన్ 4తో ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమెకు పలు సినిమాల్లో నటించే ఛాన్స్ లభించింది. తమిళ స్టార్ విజయ్ దళపతికి చెందిన వారిసు చిత్రంతో పాటు కాఫీ విత్ లవ్, తుగ్లక్ దర్బార్, మై డియర్ భూతం వంటి మూవీస్ లో నటించింది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన కార్తీక్ శంకర్‌ను సంయుక్త ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం వీరిద్దరు విడాకులు తీసుకొని విడివిడిగా ఉంటున్నారని సమాచారం. ఈ క్రమంలోనే తన కొడుకుతో కలిసి ఒంటరిగా ఉంటున్న సంయుక్త.. సీఎస్‌కే మాజీ క్రికెటర్ శ్రీకాంత్ అనిరుధతో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యిందని, త్వరలోనే పెళ్లి కూడా కాబోతున్నట్లు నెట్టింట్ ప్రచారం జరుగుతుంది.
1983 ప్రపంచకప్ విజేత అయిన క్రిష్ శ్రీకాంత్ కొడుకే అనిరుధ శ్రీకాంత్. టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన అనిరుధ చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు హైదరాబాద్ తరఫున ఆడాడు. అరంగేట్ర ఐపీఎల్ సీజన్ నుంచి 2013 వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు అనిరుధ శ్రీకాంత్ ఆడాడు. ఐపీఎల్ 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు. మొత్తం 20 మ్యాచ్‌లు ఆడి 136 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో కామెంటేటర్‌గా అవతారమెత్తాడు. అనిరుధ కూడా 2012లో ఆర్తి వెంకటేష్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ కొన్నాళ్లకే ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఒంటరిగానే ఉంటున్న అనిరుధ.. సంయుక్తను రెండో వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Andhra vs Tamil Nadu: తమిళనాడుపై ఆంధ్ర జట్టు సంచలన విజయం
Naseem Shah: పాకిస్థాన్ క్రికెటర్ ఇంటిపై కాల్పులు
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..