Bengaluru News: తమ్ముడిని హత్య చేసిన అన్న..
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:22 PM
తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తునాన్నరన్న అనుమానంతో తోడుబుట్టిన తమ్ముడినే అన్న హత్య చేశాడు. ఘటన రాయచూరు జిల్లా సింధనూరు తాలూకాలోని వెంకటేశ్వర క్యాంప్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
- భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతోనే..
రాయచూరు(బెంగళూరు): తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తునాన్నరన్న అనుమానంతో తోడుబుట్టిన తమ్ముడినే అన్న హత్య చేశాడు. ఘటన రాయచూరు(Rayachuru) జిల్లా సింధనూరు తాలూకాలోని వెంకటేశ్వర క్యాంప్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సురేశ్ అలియాస్ సూరిబాబు(38), రాజు అలియాస్ ఎమ్మిరాజు(32) ఇద్దరు స్వయాన అన్నదమ్ములు తమ్ముడు హైదరాబాద్(Hyderabad)లో ల్యాండ్రీ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అన్న సూరిబాబు(Suribabu) స్వంత గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్ నుంచి స్వంత గ్రామానికొచ్చిన తమ్ముడు అన్నతో కలిసి రాత్రి పూటుగా మద్యం సేవించారు. తాగిన మత్తులో ఇద్దరు ఘర్షణకు దిగగా మాటల మధ్యలో వదిన ప్రస్తావన రావడంతో తమ్ముడిపై అనుమానం పెంచుకున్న అన్న కొడవలితో తలపై బలంగా బాదాడు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన తమ్ముడు రాజు అక్కడికక్కడే కుప్పకూలి పడ్డాడు. విషయం తెలుసుకున్న సింధనూరు రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
10 పరీక్షల ఫీజు చెల్లింపునకు 25 వరకు గడువు
Read Latest Telangana News and National News