Rohit Sharma video: అదే రోహిత్ గొప్పదనం.. ఫొటో షూట్ చేస్తున్న జంటను ఎలా సర్‌ప్రైజ్ చేశాడో చూడండి..
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:35 PM
తాజాగా ముంబైలో ప్రీ-వెడ్డింగ్ షూట్ జరుపుకుంటున్న ఓ కొత్త జంటకు రోహిత్ స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆ వధూవరుల హృదయాలను గెలుచుకున్నాడు
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మైదానం బయట చాలా సరదాగా ఉంటాడు. బయటకు వచ్చినపుడు అభిమానులతో నవ్వుతూ, సరదాగా మాట్లాడుతుంటాడు. స్టార్ క్రికెటర్ అనే ఫీలింగ్‌కు కాస్త దూరంగా ఉంటాడు. అందుకే రోహిత్ శర్మను ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. తాజాగా ముంబైలో ప్రీ-వెడ్డింగ్ షూట్ జరుపుకుంటున్న ఓ కొత్త జంటకు రోహిత్ స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆ వధూవరుల హృదయాలను గెలుచుకున్నాడు (Rohit Sharma dance video).
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రోహిత్ ముంబైలోని ఓ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నాడు. ఆ జిమ్ బయట ఓ కొత్త జంట ప్రీ-వెడ్డింగ్ ఫొటో షూట్‌లో పాల్గొంటోంది. ఆ సమయంలో రోహిత్ కిటికీ దగ్గరకు వచ్చి బాలీవుడ్ హిట్ సాంగ్ 'మేరే యార్ కి షాదీ హై'ను తన స్పీకర్‌లో ప్లే చేస్తూ డ్యాన్స్ చేశాడు. రోహిత్‌ను చూసిన కొత్త జంట ఆశ్చర్యపోయారు. రోహిత్‌కు వరుడు నమస్కారం చేశాడు. రోహిత్ సింప్లిసిటీని అందరూ ప్రశంసిస్తున్నారు (Rohit Sharma viral video).
ఆ కొత్త జంటకు రోహిత్ గొప్ప బహుమతి ఇచ్చాడని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు (Rohit Sharma funny moments). వారి వివాహాన్ని స్పెషల్‌గా మార్చాడని ప్రశంసిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన రోహిత్ శర్మ త్వరలో సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. భారత్, సౌతాఫ్రికా మధ్య వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి..
Andhra vs Tamil Nadu: తమిళనాడుపై ఆంధ్ర జట్టు సంచలన విజయం
Naseem Shah: పాకిస్థాన్ క్రికెటర్ ఇంటిపై కాల్పులు
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..