Viral Video: ఎంతకు దిగజారిపోయార్రా.. వీళ్లు చోరీ చేస్తున్నదేంటో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Feb 26 , 2025 | 01:50 PM
కొన్నిసార్లు చోరీలు జరిగే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. పక్కనే ఉంటూ మనకు తెలీకుండానే మన వస్తువులను ఎత్తుకెళ్తుంటారు. మరికొందరు ఎంత కట్టుదిట్టమైన భద్రత కల్పించినా కూడా సులభంగా చోరీలు చేసేస్తుంటారు. ఇలాంటి చోరీలను నిత్యం చూస్తుంటాం. అయితే ..

కొన్నిసార్లు చోరీలు జరిగే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. పక్కనే ఉంటూ మనకు తెలీకుండానే మన వస్తువులను ఎత్తుకెళ్తుంటారు. మరికొందరు ఎంత కట్టుదిట్టమైన భద్రత కల్పించినా కూడా సులభంగా చోరీలు చేసేస్తుంటారు. ఇలాంటి చోరీలను నిత్యం చూస్తుంటాం. అయితే కొందరు చోరీ చేయడం చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటుంది. ఇంటి బయట ఆరేసిన మహిళల లోదుస్తులను ఎత్తుకెళ్లే వారిని చూశాం. కార్లలో వచ్చి రోడ్డు పక్కన పూల కుండీలను ఎత్తుకెళ్లేవారిని చూశాం. ఆఖరికి రోడ్ల పక్కన లైట్లను ఎత్తుకెళ్లే పోలీసులను కూడా చూశాం. తాజాగా, కొందరు యువకులు చేసిన చోరీ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఎంతకు దిగజారిపోయార్రా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యాపారి వేకువజాము రోడ్డు పక్కన ప్లా్స్టిక్ ట్రేలలో పాల ప్యాకెట్లను ఉంచి విక్రయిస్తున్నాడు. అయితే అతను కాస్త ఏమరపాటుగా ఉన్న సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వచ్చిన ముగ్గురు యువకులు ట్రేల పక్కనే ఆపి, అందులోని పాల ప్యాకెట్లను ఎత్తుకెళ్తారు.
ఎవరికి చేతి వచ్చిన ప్యాకెట్లను వారు ఎత్తుకుని, (Youth stole milk packets) యజమాని అక్కడికి వచ్చేలోపే ఉడాయిస్తారు. దొంగలు పాల ప్యాకెట్లను ఎత్తుకెళ్లడం గమనించిన వ్యాపారి.. కాస్త దూరం వేగంగా వచ్చి చేసేదేమీ లేక నిలబడి అలాగే చూస్తుండిపోతాడు. ఇలా ఆ యువకులు మరీ దారుణంగా పాల ప్యాకెట్లను కూడా ఎత్తుకెళ్లడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
Train Viral Video: ఈ డ్రైవరేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే.. రైలును ఆపి మరీ పట్టాల మధ్యలో..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చివరకు పాల ప్యాకెట్లను ఎత్తుకెళ్లే స్థాయికి దిగజారిపోయారు కదరా’’.. అంటూ కొందరు, ‘‘చదువుకున్న వారు కూడా ఇలా చేయడం దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 42 వేలకు పైగా లైక్‌లు, 2.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..